Site icon HashtagU Telugu

TS: తెలంగాణలో అడుగుపెట్టిన రాహుల్ భారత్ జోడో యాత్ర…స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు..!!

Bharat Jodo Yatra

Bharath Jodo Yatra

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ తెలంగాణలోకి ప్రవేశించింది. కర్నాటకలోని రాయచూర్ జిల్లా నుంచి తెలంగాణలోని పాలమూరు జిల్లాలోకి అడుగుపెట్టారు రాహుల్ గాంధీ. నారాయణపేట జిల్లా గూడబల్లేరు సమీపంలో కృష్ణచెక్ పోస్టు దగ్గర తెలంగాణలోకి ప్రవేశించారు.కాగా కర్నాటకపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జాతీయ జెండాను తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ కు టీకాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఇతర పార్టీ నాయకులు ఉన్నారు. బతుకమ్మలు, బోనాలు, డోలు వాయిద్యాలతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి మూడు కిలో మీటర్లు పాదయాత్ర సాగనుంది. తర్వాత విరామం తీసుకుంటారు. అనంతరం ఢిల్లీకి వెళ్తారు రాహుల్.

కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే ప్రమాణస్వీకారం సందర్భంగా ఈనెల 24,25,26 తేదీల్లో రాహుల్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. 26వ తేదీ తిరిగి తెలంగాణకు చేరుకుంటారు. అక్టోబర్ 27 నుంచి గూడెంబెల్లూరు నుంచి యాత్ర ప్రారంభం కానుంది.

Exit mobile version