Site icon HashtagU Telugu

Ibrahimpatnam RDO Office : ఇబ్రహీంపట్నం లో ఉద్రిక్తత..పోస్టల్‌ బ్యాలెట్‌ రూమ్ సీల్ ఓపెన్

Congress Protest At Ibrahim

Congress Protest At Ibrahim

ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam ) లో ఉద్రిక్తత నెలకొంది. మరికొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నం లో పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్స్ ల సీల్ తొలగించి ఉంచడం..అందులో ఉండాల్సిన బ్యాలెట్ పేపర్లు లేకపోవడం ఫై అనేక అనుమానాలు రేకెత్తిస్తుంది.

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఎవరు విజయం సాధిస్తారో రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పలేకపోతున్నారు. ఓ పక్క ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి జై కొడుతుంటే..బిఆర్ఎస్ నేతలు మాత్రం హ్యాట్రిక్ కొట్టబోతున్నాం..సంబరాలకు సిద్ధం కండి అని భరోసా ఇస్తున్నారు. ఇలా ఇరు పార్టీల ధీమాల తో రాష్ట్ర ప్రజలే కాదు దేశ వ్యాప్తంగా తెలుగు ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారు. అసలు రేపు ఏంజరగబోతుందో అనే ఉత్కంఠ నెలకొని ఉన్న సమయంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సీల్ ను తొలగించి ఉంచడం ఫై అనేక అనుమానాలు వస్తున్నాయి.

నవంబర్ 29 న పోస్టల్ బ్యాలెట్లు ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్ లో భద్రపరిచారు. కానీ ఆ తర్వాత వాటిని స్ట్రాంగ్ రూమ్ కు తరలించకుండా ఉంచిన విషయాన్నీ తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు..శనివారం పెద్ద ఎత్తున ఆర్డీవో ఆఫీస్ ను చుట్టుముట్టారు. ఎందుకు పోస్టల్ బ్యాలెట్లు తరలించలేదని అధికారులను ప్రశ్నించారు. ఇదే క్రమంలో భద్రపరిచిన పోస్టల్ బ్యాలెట్లు బాక్స్ లకు సీల్ లేకుండా ఉండడం..అందులో ఉండాల్సిన బ్యాలెట్ పేపర్లు లేకపోవడం తో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఏదో పెద్ద కుట్ర జరిగి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ను అధికారులు స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. ఇక, పోస్టల్‌ బ్యాలెట్‌ను స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించిన తర్వాతే అధికారులు సీల్‌ వేశారు. పోలింగ్‌ జరిగి రెండు రోజులు దాటినా స్ట్రాంగ్‌ రూమ్‌కు తాళం లేకపోవడం పట్ల కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి దీనిపై ఎన్నికల సంఘం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Read Also : Hattrick Loading 3.0 : ఉత్కంఠ రేపుతున్న కేటీఆర్ ‘హ్యాట్రిక్ లోడింగ్ 3.0’ ట్వీట్ ..