Congress Job Calendar: తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, యువతకు కాంగ్రెస్ హామీ

నిరుద్యోగ యువతపై కాంగ్రెస్ పార్టీ వరాల జల్లు కురిపించింది. ఈ మేరకు తొలి ఏడాదిలో ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొంది.

Published By: HashtagU Telugu Desk
Expected Jobs

Jobs employment

Job Calendar: తెలంగాణ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో  భాగంగా ఉద్యోగ క్యాలెండర్‌ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని విజయాన్ని తెలంగాణలో పునరావృతం చేయాలని కృతనిశ్చయంతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల హామీలలో భాగంగా ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మాణాన్ని పరిరక్షించడంతో పాటు అనేక వాగ్దానాలు చేసింది.

ముఖ్యంగా నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని వరాలు కురిపించింది. తెలంగాణలో తొలి ఏడాదిలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ను తయారు చేస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రజలకు 37 వాగ్దానాలు, అభివృద్ధిపై కాంగ్రెస్ మేనిఫెస్టో దృష్టి సారించింది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) తరహాలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి)ని పునరుద్ధరించడానికి, బాసర ఐఐఐటి తరహాలో మరో నాలుగు ఐఐఐటిలను ఏర్పాటు చేయడానికి కొత్త చట్టాన్ని రూపొందిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. అన్ని శాఖల్లోని ఖాళీలతో కూడిన వార్షిక ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రతి సంవత్సరం జూన్ 2 నాటికి విడుదల చేస్తామని, సెప్టెంబర్ 17 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.

Also Read: Telegram: టెలిగ్రామ్ లో చైల్డ్ పోర్న్ కంటెంట్, పోలీసుల యాక్షన్

  Last Updated: 17 Nov 2023, 04:45 PM IST