CM KCR : అమ్మో! కేసీఆర్ డేంజ‌ర్! జార్ఖండ్ పై ఐరెన్ లెగ్‌!!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్క‌డికి వెళితే అక్క‌డి సీఎం ఔట్. ఇలా యాదృశ్చికంగా జ‌రుగుతుందా? లేక కేసీఆర్ పాద‌మో తెలియ‌దుగానీ జ‌రుగుతోన్న‌ పరిణామాల‌ను కేసీఆర్ కు ముడిపెడుతూ ఆయ‌న పాదానికి కాంగ్రెస్ పార్టీ `ఐరెన్ లెగ్` ముద్ర వేసింది.

  • Written By:
  • Publish Date - August 25, 2022 / 04:00 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్క‌డికి వెళితే అక్క‌డి సీఎం ఔట్. ఇలా యాదృశ్చికంగా జ‌రుగుతుందా? లేక కేసీఆర్ పాద‌మో తెలియ‌దుగానీ జ‌రుగుతోన్న‌ పరిణామాల‌ను కేసీఆర్ కు ముడిపెడుతూ ఆయ‌న పాదానికి కాంగ్రెస్ పార్టీ `ఐరెన్ లెగ్` ముద్ర వేసింది. దానికి బ‌లం చేకూరేలా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఆయనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది.

గవర్నర్​ రమేశ్​ బైస్​కు ఆ మేరకు నివేదిక అందింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం. ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ మైనింగ్​ లీజును సొంతానికి కేటాయించుకున్నారని బీజేపీ ఆరోప‌ణ చేసింది. ఇది అధికార దుర్వినియోగమేనని ఆరోపిస్తూ భాజపా గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై ఈసీ అభిప్రాయం కోరారు గవర్నర్. విచార‌ణ చేసిన ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా అతి త్వరలోనే ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకునే అవకాశముంది.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కేసీఆర్ ఇటీవ‌ల క‌లిశారు. ఇప్పుడు ఎక్సైజ్ స్కామ్ కేజ్రీ ప్ర‌భుత్వాన్ని కుదిపేస్తోంది. . ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు క‌ల్వ‌కుంట్ల కుటుంబ స‌భ్యుల ప్ర‌మేయంపై సీబీఐ ఆరా తీస్తోంది. పంజాబ్ వ‌ర‌కు ఎక్సైజ్ స్కామ్ లింకులు ఉన్నాయ‌ని సీబీఐ ప్రాథమికంగా అనుమానిస్తోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా స్కామ్‌లో ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉన్నార‌ని అనుమానిస్తూ విచార‌ణ కొన‌సాగుతోంది.

మ‌హారాష్ట్ర సీఎంగా ఉద్ద‌వ్ థాక‌రే ఉన్న‌ప్పుడు కేసీఆర్ అక్క‌డికి వెళ్లారు. అంతే నెల రోజులకు థాక‌రే సీఎం ప‌ద‌విని కోల్పోయారు. క‌ర్నాట‌క రాష్ట్రానికి ప‌లుమార్లు వెళ్లిన కేసీఆర్ అప్ప‌ట్లో సీఎంగా ఉన్న కుమారస్వామిని క‌లిశారు. సీన్ క‌ట్ చేస్తే, క‌ర్నాట‌క సీఎం ప‌ద‌విని కుమార‌స్వామి వ‌దులుకున్నారు. ఆశీస్సుల కోసం త్రిదండి చిన్న చియ్య‌ర్ వ‌ద్ద‌కు య‌డ్డీ వ‌చ్చిన సంద‌ర్భంగా కేసీఆర్ తో మాటలు క‌లిపారు. అంతే, సీఎం ప‌ద‌వి పోయింది.

బీహార్ రాజకీయాల‌ను సీఎం కేసీఆర్ క‌దిలించారు. ఆ రాష్ట్రానికి చెందిన ఆర్జేడీ చీఫ్ తేజ‌స్వీ యాదవ్ ను క‌లుసుకున్నారు. సీఎం ప‌ద‌విని ల‌క్ష్యంగా చేసుకుని రాజ‌కీయాలు చేస్తోన్న తేజ‌స్వీ ఇప్పుడు డిప్యూటీ సీఎం ప‌ద‌వికి ప‌రిమితం అయ్యారు.తాజాగా ఏర్ప‌డిన కొత్త కూట‌మికి మ‌ళ్లీ నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు. దీంతో తేజ‌స్వి గ్రాఫ్ అక్క‌డ క్ర‌మంగా మ‌స‌క‌బారే ప‌రిస్థితి ఏర్ప‌డింది.
బెంగాల్ సీఎం మ‌మ‌త‌ను ఆ రాష్ట్ర ఎన్నిక‌ల‌కు ముందుగా కేసీఆర్ క‌లిశారు. అధికారంలోకి టీఎంసీ వ‌చ్చిన‌ప్ప‌టికీ మ‌మ‌త మాత్రం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. మ‌ళ్లీ ఆమె ఎన్నిక‌ల్లో పోటీ చేసిన గెల‌వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అంతేకాదు, అక్క‌డ ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక స్కామ్ లో ఇరుక్కుంటోంది.

అచంద్ర‌బాబుతో చ‌ట్టాప‌ట్టాల్ వేసుకుని కేసీఆర్ కొంత కాలం తిరిగారు. సీన్ క‌ట్ చేస్తే, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీతో పాటు చంద్ర‌బాబు ఎదురు ఈదుతున్నారు. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర‌య్యేలా కేసీఆర్ వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే కాదు, ఆ పార్టీతో క‌లిసి రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు వెళ్లారు. అంతే, సోనియా, రాహుల్ ను ఈడీ వెంటాడుతోంది.
ఆయా రాష్ట్రాల్లో కేసీఆర్ క‌లిసి వ‌చ్చిన త‌రువాత జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను గుర్తు చేస్తోన్న కాంగ్రెస్ మాత్రం ఆయ‌న పాదం ( ఐర‌న్ లెగ్‌) మ‌హిమ అంటూ సెటైర్లు వేస్తోంది. కేసీఆర్ ఎక్క‌డ‌కు వెళితే అక్క‌డ అధికారంలో ఉన్న వాళ్లు ఔట్ అంటూ ప్ర‌చారం మొద‌లైయింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ ప‌లుమార్లు కేసీఆర్ ను క‌లిసి సీఎం ప‌ద‌విని పోగొట్టుకోబోతున్నారని దేశ వ్యాప్తంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.