Site icon HashtagU Telugu

Congress Bus Yatra : తెలంగాణ లో రాహుల్ బస్సు యాత్ర..

Congress Bus Yatra

Congress Bus Yatra

తెలంగాణ (Telangana)లో ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ (Congress) పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ఇతర పార్టీల నేతలను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తూ..వారికీ టికెట్స్ కేటాయిస్తున్నారు. అలాగే ప్రజల అవసరాల తగ్గట్లు మేనిఫెస్టో (Congress 2023 Manifesto) ను సిద్ధం చేస్తుంది. ఇప్పటికే 6 గ్యారెంటీ హామీ పథకాలను ప్రకటించి ప్రజలను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు బస్సు యాత్ర (Congress Bus yatra) చేపడుతుంది. ఈ యాత్ర తో కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. బస్సు యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాయి. ఈ బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొనబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి, కాంగ్రెస్‌కు విస్తృత ప్రచారం కల్పించనున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసేలా ఈ యాత్ర సాగుతుంది. ఈ బస్సు యాత్ర ద్వారా పూర్తిస్థాయి ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సిద్ధమైనట్లే. ఈ బస్సు యాత్రకు మరింత జోష్ తెచ్చేలా.. అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా పాల్గొనబోతున్నారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో బస్సు యాత్రలో రాహుల్ పాలుపంచుకుంటారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ పార్టీ ఖరారు చేసింది. కీలకమైన అభ్యర్థుల ప్రకటన బస్సు యాత్రకు ముందే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తైంది. కొన్ని నియోజకవర్గాలు మినహా చాలా వాటికి అభ్యర్థుల్ని దాదాపు ఖరారు చేశారు. ఈ నెల 10న సాయంత్రం గాంధీ భవన్‌లో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది. మరోపక్క తాజాగా రాష్ట్రంలో లోక్‌పాల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు వెలువడ్డాయి. ఈ సర్వే ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 61 నుంచి 67 అసెంబ్లీ స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 41 నుంచి 44 వరకు ఓట్ల శాతాన్ని నమోదు చేసుకుంటుందని ఈ సర్వేలో తేలింది. ఈ సర్వే తో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత జోష్ పెరుగుతుంది.

Read Also : PM Kisan Removals : ‘పీఎం కిసాన్’ నుంచి భారీగా లబ్ధిదారుల తొలగింపు.. మీ పేరుందా ?