Site icon HashtagU Telugu

Kale Yadaiah : గో బ్యాక్ ఎమ్మెల్యే కాలే యాదయ్య..కాంగ్రెస్‌ కార్యకర్తల నిరాహార దీక్ష

Kaale Goback

Kaale Goback

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా బిఆర్ఎస్ (BRS) పార్టీ కి షాకులు తప్పడం లేదు. గెలిచిన కొద్దీ మంది కూడా కాంగ్రెస్ (Congress) లోకి వేస్తూ అధినేత కేసీఆర్ కు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. శుక్రవారం బీఆర్​ఎస్​ చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య న్యూఢిల్లీలో కాంగ్రెస్​ పార్టీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్​ రెడ్డి, ఇన్​ చార్జీ దీపాదాస్​ మున్షీ సమక్షంలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. ఇటీవలే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​ కుమార్​, మాజీ స్పీకర్​ పోచారం, కడియం శ్రీహరి, దానం నాగేందర్​, భద్రాచలం ఎమ్మెల్యే లు కూడా గులాబీ పార్టీకి బైబై చెప్పిన విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

ఎమ్మెల్యే కాలే యాదయ్య (MLA Kale Yadaiah) కాంగ్రెస్ లో చేరడం ఫై జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలె యాదయ్య చేరికను నిరసిస్తూ వికారాబాద్‌ జిల్లా నవాబుపేటలో మండల కాంగ్రెస్‌ వర్కింగ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొండల్‌ యాదవ్‌, కార్యకర్తలు నిరాహార దీక్షకు దిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడ ఉందని ప్రశ్నించిన కాలె యాదయ్య.. ఇప్పుడు అదే పార్టీలో చేరడం హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా కొండల్‌ యాదవ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై ఆయన గతంలో అనేక కేసులు పెట్టించాడని గుర్తుచేశారు. యాదయ్య చేరిక కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also : Future PM : ‘కాబోయే ప్రధానమంత్రి అఖిలేష్’.. పోస్టర్లపై పొలిటికల్ చర్చ

Exit mobile version