Site icon HashtagU Telugu

Y S Sharmila : వైఎస్ షర్మిలకు ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ

Congress Party Thanks to Sharmila

Congress Party Thanks to Sharmila

పాలేరు బరిలో నుండి తప్పుకున్న వైఎస్ షర్మిల (Y S Sharmila)కు కాంగ్రెస్ పార్టీ (COngress Party) ధన్యవాదాలు తెలిపింది. నిన్నటి వరకు పాలేరు బరిలో దిగుతున్నట్లు తెలిపిన షర్మిల..నేడు అసలు తెలంగాణ ఎన్నికల్లోనే పోటీ చేయడం లేదని తెలిపి అందరికి షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే YSRTP ని స్థాపించామని, సీఎం కేసీఆర్ (CM KCR) ప్రజలను మోసం చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. ఓటు బ్యాంకు చీలకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కేసీఆర్ మరోసారి సీఎం కాకూడదని అన్నారు. తాము పోటీ చేయకపోవడం చాలా బాధాకరమైన నిర్ణయమని అయినా తప్పలేదని చెప్పారు. ఇది తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న త్యాగమని, ఈ విషయంలో తాను తప్పు చేసినట్లు అనిపిస్తే క్షమించాలని కోరారు. రాజకీయాలు అంటే చిత్తశుద్ధి, ఓపిక ఉండాలని లేకుంటే రాణించలేమని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

పది రోజుల క్రితం అన్ని స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నామని, కానీ మనం యుద్ధం చేసే సమయం ఇంకా రాలేదని షర్మిల చెప్పారు. మనకు యుద్ధం చేసే సమయం వస్తుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓట్లు చీలిస్తే ప్రజలు తనను క్షమించరని అన్నారు. గెలుపు ముఖ్యమేనని, అయితే త్యాగం అంతకంటే గొప్పదని చెప్పారు. షర్మిల తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ..ఈ సందర్బంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ‘థ్యాంక్యూ… షర్మిల గారు’ అని ట్వీట్ చేశారు. ఇక పాలేరు బరి నుండి షర్మిల తప్పుకోవడం తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కి మరింత ప్లేస్ అయ్యింది. ఒకవేళ షర్మిల బరిలో ఉంటె తప్పకుండ ఓట్లు చీలేవి..కానీ ఇప్పుడు ఆమె తప్పుకోవడం తో ఆమెకు వేద్దామనుకున్న వారు కూడా పొంగులేటి కే వేస్తారు.

Read Also : Padi Kaushik Reddy : హుజురాబాద్ లో జోరుగా పాడి కౌశిక్ రెడ్డి ప్రచారం