Congress Rachabanda: రేవంత్ ప్లాన్ వర్కౌట్ అయింది.. రచ్చబండ సక్సెస్ అయింది

రచ్చబండ గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రారంభమై ఒక్కరోజే అయినా.. అప్పుడే ఎలా చెప్పగలరు అనుకోవచ్చు.

  • Written By:
  • Publish Date - May 22, 2022 / 06:47 PM IST

రచ్చబండ గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రారంభమై ఒక్కరోజే అయినా.. అప్పుడే ఎలా చెప్పగలరు అనుకోవచ్చు. కాని, ఒక ప్రతిపక్షాన్ని అధికారపక్షం బలంగా అడ్డుకోవాలనుకుంటోందంటే.. ఈ గేమ్ లో విజయం ఎవరిదో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమం మొదలుపెట్టిన కాంగ్రెస్.. రైతు డిక్లరేషన్ ను బలంగా తీసుకెళ్లాలనుకుంటోంది. వరంగల్ సభలో ప్రవేశపెట్టిన ఈ డిక్లరేషన్ పై తెలంగాణ సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేసీఆర్ సర్కార్ రైతు బంధు ఇస్తున్నప్పటికీ.. దానికంటే ఇది బెటర్ గా ఉందన్న అభిప్రాయం రైతుల నుంచి వినిపిస్తోంది. సో, డిక్లరేషన్ ను జనాల్లోకి తీసుకెళ్లగలిగితే కాంగ్రెస్ సగం సక్సెస్ సాధించినట్టే. అందుకే, టీఆర్ఎస్ శ్రేణులు రచ్చబండను అడ్డుకోవాలని చూస్తున్నాయనే విమర్శలు వినిపిస్తు్న్నాయి.

రచ్చబండను మొదటి రోజే టీఆర్ఎస్ అడ్డుకోవడం తొలి విజయంగా భావిస్తోంది కాంగ్రెస్. ఎందుకంటే రచ్చబండ కార్యక్రమం సాఫీగా సాగితే మీడియా దృష్టి పడుతుందో లేదో తెలీదు. కాని, గొడవ జరిగితే మాత్రం రచ్చబండ గురించి కచ్చితంగా పది మందికీ తెలుస్తుంది. పైగా ఈ గొడవల ద్వారా జనాల నుంచి సింపథీ కూడా సంపాదించొచ్చు. రైతుల గురించి ఏదో చెబుదామని వస్తుంటే కాంగ్రెస్సోళ్లను ఎందుకు అడ్డుకుంటున్నారు అనే అభిప్రాయం రావొచ్చు. ఇప్పటికే రైతు డిక్లరేషన్ పై మంచి అభిప్రాయం వచ్చినందున ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుందనే చర్చ జరుగుతోంది.

ఈ మొత్తం విజయం రేవంత్ ఖాతాలో పడుతుందా లేదా సీనియర్లందరికీ దక్కుతుందా అన్నదానిపై కాంగ్రెస్ లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.