Site icon HashtagU Telugu

Congress vs Tollywood : కాంగ్రెస్ పార్టీ వల్ల చిత్రసీమ కళ తప్పబోతుందా..?

CM Revanth Reddy

CM Revanth Reddy

తెలంగాణ ప్రజలు (People of Telangana) ఎంతో నమ్మకం తో కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి పట్టంకట్టారు. పదేళ్ల పాటు కేసీఆర్ (KCR) పాలన చూసిన ప్రజలు..ఒక్కసారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా ఋణం తీర్చుకుందాం అని చెప్పి భారీ మెజార్టీ తో గెలిపించారు. సోనియా పై గౌరవం…కొంతమంది బిఆర్ఎస్ నేతలు విచ్చలవిడి తనం తట్టుకోలేక…కాంగ్రెస్ హామీలు నచ్చి..ఇలా పలు కారణాలతో బిఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. కానీ బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టుకొని చాల తప్పుచేశామని ఓట్లు వేసిన వారంతా ఇప్పుడు భాదపడుతున్నారు. దీనికి కారణం అధికార కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు..చేసే పనులు..అనే మాటలే.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గరికి వస్తున్న ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. కేవలం ఫ్రీ బస్సు , ఉచిత కరెంట్ తప్ప ఏ హామీలు అమలు చేయలేదు. రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయింది. మిగతా హామీలు ఏవి కూడా అమలు చేయకపోయేసరికి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెన్షన్ దారులు , రైతులైతే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలు కోతకు వచ్చే సమయం వచ్చినప్పటికీ ఇంకా పెట్టుబడి సాయం వేయలేదని , ఇక పెన్షన్ ల పెంపు కూడా చేయాలనీ ఇటు పెన్షన్ దారులు ఆగ్రహంగా ఉన్నారు.

ఇక హైదరాబాద్ వాసులైతే తిట్లదండకమే చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ తీసుకొచ్చిన హైడ్రా..ఎంతోమందిని రోడ్డున పడేసింది. హైడ్రా ఆచరణ సరిగా లేకపోవడం..అన్ని అనుమతులు ఉన్న భవనాలను సైతం కూల్చడం తో వారంతా హైకోర్టు కు వెళ్లారు. దీనిపై కోర్ట్ సైతం సీరియస్ అయ్యింది. ప్రస్తుతం హైడ్రా దూకుడు తగ్గినట్లు కనిపిస్తుంది. ఇదిలా ఉంటె ఈరోజు మంత్రి కొండా సురేఖ…చేసిన కామెంట్స్ పై చిత్రసీమ ఆగ్రహంతో ఉంది. కేటీఆర్ వల్లే నాగ చైతన్య – సమంతలు విడిపోయారని..చిత్రసీమలో చాలామంది హీరోయిన్లకు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేసాడని..కేటీఆర్ వల్లే చాలామంది పెళ్లి చేసుకొని పోయారని ఇలా కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై ప్రకాష్ రాజ్ తో పాటు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేసారు.

నాగచైతన్య, సమంత జంట విడిపోవడానికి కేటీఆర్‌ కారణమంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సోషల్‌ మీడియా వేదికగా మండిపడ్డారు. ‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా..? అంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి అని కొండా సురేఖ‌కు హిత‌వు ప‌లికారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండ‌ని సూచించారు. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అని నాగార్జున స్ప‌ష్టం చేశారు. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను అని కొండా సురేఖ‌కు నాగార్జున పేర్కొన్నారు. ఇదే కాదు మొన్నటికి మొన్న ఎన్టీఆర్ నటించిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సరైన భద్రత ఇవ్వకపోవడం..చివరకు ఈవెంట్ రద్దు అయ్యేలా జరిగింది. ఇలా చిత్రసీమ కూడా కాంగ్రెస్ సర్కార్ వల్ల ఇబ్బందులు పడుతుంది. ఇలాగే కొనసాగితే చిత్రసీమ ఈవెంట్ లు మొత్తం ఏపీలో చేసుకోవాల్సి వచ్చే పరిస్థితులు వస్తాయి. ఇక షూటింగ్ లు సైతం తగ్గిపోతాయని సినీ లవర్స్ , ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు చిత్రసీమను ముడిపెట్టొద్దని కోరుకొంటున్నారు. చిత్రసీమ అనేది ఎప్పటికి ఉండేదని..అధికార పార్టీ అనేది ఎప్పటికి శాశ్వతం కాదనేది గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు.

Read Also : Ola Electric Scooters: రూ. 49 వేల‌కే ఓలా ఎస్‌1 ఎల‌క్ట్రిక్‌ స్కూట‌ర్‌!