కాంగ్రెస్ చేపట్టిన కులగణన సర్వే(census survey) పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేసారు. బీసీల ఓట్ల (BC Votes) కోసమే కాంగ్రెస్ కులగణన చేపట్టిందని అన్నారు. ఆదివారం హన్మకొండలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో కేటీఆర్ మాట్లాడుతూ..చేతిగుర్తుకు ఓటేసిన పాపానికి చేతివృత్తిదారుల గొంతు కోశారని , కొత్త ప్రభుత్వాలు దేవుడెరుగు. ఉన్న పథకాలే ఆగిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ డిక్లరేషన్ పేరిట ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఏడాది కిందట బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందా అని ప్రశ్నించారు.
బీసీల ఓట్ల కోసం కులగణన అనే కొత్త నాటకాన్ని కాంగ్రెస్ మొదలుపెట్టిందని, కులగణనలో 175 ప్రశ్నలు అడుగుతున్నారని.. బ్యాంకుల్లో డబ్బు ఎంత ఉంది? ఇంట్లో ఏసీ ఉందా? ఫ్రిజ్ ఉందా? అని అడుగుతున్నారని ..దీంతో కులగణన కోసం వెళ్లిన అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని , ఆ హామీ నెరవేర్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదని తెలిపారు.
Read Also : Rohit Sharma Poster: రోహిత్ శర్మను అవమానించిన ఆస్ట్రేలియా మీడియా.. ఏం చేసిందంటే?