Site icon HashtagU Telugu

Congress PAC Meeting : రేపు కాంగ్రెస్ పీఏసీ సమావేశం..

Congress Pac Meetting

Congress Pac Meetting

రేపు (సోమవారం) గాంధీ భవన్ లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం (Congress PAC Meeting) జరగనుంది. ఈ సమావేశం ఫై సర్వ్త్ర ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారి పీఏసీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేదానిపై అంత మాట్లాడుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. పార్లమెట్ ఎన్నికల సన్నద్దత, తాజా రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ పదిరోజుల పరిపాలన, నామినేటెడ్ పోస్టులు, కొత్త డీసీసీల నియామకాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటె సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆదివారం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశం అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై వీరు చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు సీఎంకు ఆర్బీఐ మాజీ గవర్నర్ పలు సూచనలు చేశారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, సీఎం కార్యదర్శి పాల్గొన్నారు.

Read Also : NIA Most Wanted List : NIA మోస్ట్ వాంటెడ్ జాబితాలో తెలుగు రాష్ట్రాల యువకులు