Congress – EC : కేటీఆర్ ‘దీక్షా దివస్‌‌’ పిలుపుపై కాంగ్రెస్‌ అభ్యంతరం.. ఈసీకి లేఖ

Congress - EC : నవంబర్ 29 తెలంగాణ ఉద్యమ చరిత్రలోకీలకమైన రోజు. 

  • Written By:
  • Publish Date - November 29, 2023 / 04:32 PM IST

Congress – EC : నవంబర్ 29 తెలంగాణ ఉద్యమ చరిత్రలోకీలకమైన రోజు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గులాబీ బాస్‌ కేసీఆర్ ఆమరణ నిరహార దీక్షను చేపట్టిన రోజు అది. ఈసందర్భంగా ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. అయితే ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసిపోయిన ప్రస్తుత తరుణంలో దీక్షా దివస్‌‌ను తెలంగాణ భవన్‌లో నిర్వహించడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సైలెన్స్ పీరియడ్ అమల్లో ఉండగా రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్‌ వేడుకలు నిర్వహించాలని పిలుపు ఇవ్వడం ద్వారా మంత్రి కేటీఆర్ ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్‌రాజ్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్  వైస్‌ ప్రెసిడెంట్ నిరంజన్ లేఖ రాశారు.2009లో కేసీఆర్ దీక్షకు సంబంధించిన దృశ్యాలను ఓ మీడియా ఛానల్‌లో చూపించారని ఆ లేఖలో నిరంజన్ పేర్కొన్నారు. పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించిందని తెలిపారు. కేటీఆర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. వెంటనే దీనిపై సరైన చర్యలు తీసుకోవాలని(Congress – EC) ఈసీని కోరారు.

Also Read: Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా RCBలో చేరనున్నాడా..?