Site icon HashtagU Telugu

Rajasingh : ఆరు గ్యారెంటీ లకు నిధులు ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా..? – ఎమ్మెల్యే రాజాసింగ్

Rajasingh Congress

Rajasingh Congress

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) సెటైర్లు వేశారు. ఆరు గ్యారెంటీ (T Congress Six Guarantees) లకు నిధులు ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా..? అంటూ సీఎం రేవంత్ (CM Revanth) ను ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ లో ప్రమాణం చేయని ఎమ్మెల్యేల చేత స్పీకర్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. మొదటి రోజు అసెంబ్లీకి దూరంగా ఉన్న బిజెపి ఎమ్మెల్యేలు..ఈరోజు అసెంబ్లీ కి హాజరయ్యారు. అక్బరుద్దిన్ ముందు ప్రమాణం చేయమని చెప్పి మొదటి రోజు వారంతా అసెంబ్లీ కి హాజరు కాలేదు. ఈరోజు గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఎన్నికవ్వడం తో వారంతా హాజరయ్యారు. ఇక వారి చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యే రాజా సింగ్ అసెంబ్లీలోని మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారని తెలిపారు. ఇచ్చిన గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అమలు చేస్తోంది ? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటిలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా…? అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో తమ యుద్ధం మొదలైందని .. కాంగ్రెస్‌, ఎంఐఎం ఒకటేనని విమర్శించారు. అక్బరుద్దీన్‌ ముందుకు ప్రమాణం చేసేది లేదని.. ఆ మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. అందుకే స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ముందు ప్రమాణం చేశామన్నారు. అసెంబ్లీ ఫ్లోర్‌ లీడర్‌ ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు.

Read Also : Padi Kaushik Reddy : అసెంబ్లీలో కౌశిక్‌ రెడ్డి కూతురు అత్యుత్సాహం..బయటకు పంపిన సిబ్బంది