Chamala : పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ చామల

Chamala : ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి 140 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Chamala Pawan

Chamala Pawan

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాంగ్రెస్ పార్టీ(Congress Party)పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొందరు కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నారని..అలాంటప్పుడు వారు అక్కడికే వెళ్లిపోవాలంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పెంచాయి. దీనిపై స్పందించిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి 140 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.

Slogans : పాకిస్థాన్ జిందాబాద్ అన్నాడు..ప్రాణాలు పోయేలా కొట్టిన స్థానికులు..ఎక్కడంటే !
కాంగ్రెస్ పార్టీ అనేది సెక్యులర్ సిద్ధాంతాలను గౌరవించే, దేశ సమగ్రత కోసం పోరాడే పార్టీ. ప్రధాని మోదీకి కట్టుబడాలని అనుకుంటే, పవన్ కళ్యాణ్ రాజకీయాలను మానేసి రెండు సినిమాలు తీయాలని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ముఖ్యంగా బాధ్యతాయుత స్థానంలో ఉండే నాయకుడు, మాట్లాడే ముందు ఆలోచించాలి అని హితవు పలికారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రమాదం కలిగించవచ్చని ఆయన హెచ్చరించారు.

Akshaya Tritiya Sale : ఓలా స్కూటర్లపై రూ.40 వేలు తగ్గింపు!

అంతేకాదు ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటనలో 28 మంది చనిపోతే ..వారిని చంపిన ముష్కరులను ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారో మోదీని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా? లేక ఇంటెలిజెన్స్ విఫలమా? అని ప్రశ్నిస్తూ, సత్యాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు. మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు కాంగ్రెస్ చేయదని స్పష్టం చేశారు.

  Last Updated: 29 Apr 2025, 07:16 PM IST