Site icon HashtagU Telugu

Cheyyi Chevella Campaign : దుమ్మురేపుతున్న ‘‘చెయ్యి.. చేవెళ్ల’’ సాంగ్.. రంజిత్‌‌రెడ్డి ప్రచార హోరు

Cheyyi Chevella Campaign

Cheyyi Chevella Campaign

Cheyyi Chevella Campaign : ఎన్నికల వేళ ఓటర్లపై నినాదాల ఎఫెక్ట్ చాలానే ఉంటుంది. అటువంటిదే ఓ పదునైన, వినూత్నమైన నినాదంతో చేవెళ్ళ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి జి. రంజిత్​ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ‘‘చెయ్యి… చేవెళ్ళ… రంజిత్’’ అనే నినాదంతో కూడిన సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకే ఒక్క నినాదంతో నియోజ‌క‌వ‌ర్గం పేరు,  అభ్య‌ర్థి పేరు, పార్టీ గుర్తులను జనంలోకి తీసుకెళ్లేలా ప్రచార వ్యూహాన్ని రచించడం విశేషం. ఈ నినాదం  ప్ర‌త్య‌ర్థుల‌పై పాశుప‌తాస్త్రంలా పనిచేస్తోందని టీమ్ రంజిత్ రెడ్డి(Cheyyi Chevella Campaign) చెబుతోంది.

We’re now on WhatsApp. Click to Join

చేవెళ్ల లోక్‌స‌భ స్థానం గ‌త చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే..  2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ స్థానంలో కాంగ్రెస్‌కు 6,75,898 ల‌క్ష‌ల (22.8 శాతం) ఓట్లు వ‌చ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ఇక్క‌డ 6,62,344 (21.5 శాతం) ఓట్లు ద‌క్కాయి.  గత సంవత్సరం  డిసెంబ‌రులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ బాగా పెరిగిపోవడంతో ఏకంగా 12,98,122 (33.8 శాతం) ఓట్లు వచ్చాయి. ఈ విధంగా ఏ కోణంలో చూసినా అధికార కాంగ్రెస్  అభ్య‌ర్థికి గెలుపు అవకాశాలే ఉన్నాయి. అగ్నికి వాయువు తోడైన‌ట్టుగా ..  ‘‘చెయ్యి.. చేవెళ్ల..’’  నినాదం ఇప్పుడు కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ప్లస్ పాయింట్‌గా మారింది.

Also Read : Suicide Game : భారత విద్యార్థిని బలిగొన్న ‘సూసైడ్ గేమ్’.. ఏమిటిది ?

2004, 2009 ఎన్నిక‌ల్లో ‘‘రాజ‌న్న రాజ్యం, పేద‌ల రాజ్యం’’ అనే స్లోగ‌న్‌‌తో  కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలను సాధించింది. ఈ నినాదమే వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డిని రెండు సార్లు ముఖ్య‌మంత్రిగా చేసింది. కాంగ్రెసు పార్టీకి అచ్చొచ్చిన మ‌రో నినాదం ‘ఇందిర‌మ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం’. ఇది కూడా ఆ పార్టీని పాపుల‌ర్ చేసిన గొప్ప స్లోగ‌న్‌. ప్ర‌జ‌లంద‌రికీ సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా ఇలాంటి నినాదాల‌ను వాడుతుండ‌టం కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చింది. ఇప్పుడు లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ కూడా అలాంటి ప్ర‌యోగాలే చేసి… ఔరా… అనిపించుకుంటున్నారు చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి.

Also Read :Prisoners Voting Rights : ఖైదీలకు ఓటుహక్కు ఉంటుందా ? ఉండదా ?