Site icon HashtagU Telugu

Congress MLC candidates : తెలంగాణ కాంగ్రెస్ MLC అభ్యర్థులు ఖరారు

Ts Mlc

Ts Mlc

కాంగ్రెస్ పార్టీ MLC అభ్యర్థులను ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ పేర్లను కాంగ్రెస్ ఫైనల్ చేసింది. నామినేషన్లకు సంబంధించి అన్ని సిద్ధం చేసుకోవాలని వారికి సమాచారం ఇచ్చింది. బల్మూరి వెంకట్ విద్యార్థి ఉద్యమం నుంచి ఉన్నారు. ఎన్ ఎస్ యూఐ తరపున అనేక విద్యార్థి ఉద్యమాలు నడిపించారు. టీఎస్ పీఎస్ సీలో పేపర్ లీక్, ఇతర అక్రమాలకు సంబంధించి గట్టిగా పోరాటం చేశారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. పార్టీ కోసం కష్టపడి పని చేశారు, జైలుకి కూడా వెళ్లారు.

We’re now on WhatsApp. Click to Join.

జైల్లో ఉన్న సమయంలో స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెళ్లి బల్మూరి వెంకట్ ను పరామర్శించారు. ఇక, అద్దంకి దయాకర్ పార్టీ వాయిస్ ను అనేక వేదికలపై బలంగా వినిపించారు. తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ ప్లే చేశారు. ఉద్యమంతో పాటు కష్టకాలంలో పార్టీ కోసం పని చేశారనే ఉద్దేశంతో ఈ ఇద్దరిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. వీరిద్దరికి అవకాశం కల్పించడం పట్ల కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లుండితో ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి గడువు ముగుస్తుంది. అనేక రకాల ఈక్వేషన్లు, అనేక రకాల వ్యక్తులను పరిగణలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసింది.

అలాగే ఈ నలుగురిని ఎమ్మెల్సీలుగా చేయడంతో పాటు కేబినెట్ లోకి కూడా తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. కేబినెట్ లో ఇప్పటివరకు మైనార్టీలు లేరు కాబట్టి అమీర్ అలీ ఖాన్ ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన కోడ్ రావడానికి ముందే కేబినెట్ విస్తరణ చేయాలనే యోచిస్తున్నారు. వచ్చే నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ లను కేబినెట్ లోకి తీసుకోవాలని అనుకున్నారు. అయితే, వారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. దాంతో ఎన్నికల్లో ఓడిన వారికి కాకుండా కొత్త వారికి ప్రయారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయించింది. పార్టీ కోసం పని చేసిన వారికి అవకాశాలు ఇవ్వాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సూచించినట్లు తెలుస్తోంది.

Read Also :

Exit mobile version