Seethakka : 200 కోట్ల కేసీఆర్ డబ్బును ఓడించింది మా ములుగు ప్ర‌జ‌లే : కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కీల‌క‌స్థానాల‌ను ఓడించేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా కృషి చేసింది. అయితే ఈ

  • Written By:
  • Updated On - December 4, 2023 / 10:06 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కీల‌క‌స్థానాల‌ను ఓడించేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా కృషి చేసింది. అయితే ఈ ఎన్నిక‌ల్లో తెలంగాణ ఓట‌ర్లు బీఆర్ఎస్‌కు గ‌ట్టి షాక్ ఇచ్చారు. అధికారంలోకి వ‌స్తామ‌నుకున్న బీఆర్ఎస్ నేత‌లు ముఖ్య నేత‌లు కూడా ఘోరంగా ఓడిపోయారు. కాంగ్రెస్‌లో కీల‌క నేత‌గా ఉన్న ములుగు ఎమ్మెల్యే సీత‌క్క‌ను ఓడించేదుకు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పోరాడింది. ములుగులో డ‌బ్బును విప‌రీతంగా పంచారు. సీత‌క్క‌ను ఓడించేందుకు బ‌డే నాగ‌జ్యోతిని బీఆర్ఎస్ రంగంలోకి దించింది. బీఆర్ఎస్ సోష‌ల్ మీడియాలో కూడా సీత‌క్క‌పై తీవ్ర‌స్థాయిలో పోస్టింగ్‌లు పెట్టింది. క‌రోనా స‌మ‌యంలో కొండ‌లు, వాగులు, వంక‌లు దాటుకుంటూ వెళ్లి గిరిజ‌న‌, ఆదివాసీ బిడ్డ‌ల‌ను ఆమె ఆదుకుంది. అయితే సీత‌క్క‌ది అంతా ఫోటో షూట్ అంటూ బీఆర్ఎస్ నేత‌లు ప్ర‌చారం చేశారు. కానీ ఈ ఎన్నిక‌ల్లో ఆమెకు గ‌తం కంటే ఎక్కువ మెజార్టీని మూలుగు ప్ర‌జ‌లు అందించారు. ఈ సంద‌ర్భంగా సీత‌క్క ట్వీట్ చేశారు. 200 కోట్ల కేసీఆర్ డ‌బ్బును ఓడించింది తాను కాద‌ని.. మూలుగు ప్ర‌జ‌లేన‌ని ఆమె ట్వీట్ చేశారు. నా ప్రాణం వాళ్ల‌ది అంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌రువాత ములుగు నుంచి మేడారం వ‌ర‌కు ఆమె భారీ ర్యాలీతో వెళ్లి స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. ర్యాలీ లో దారి పొడ‌వునా ప్ర‌తిగ్రామంలో సీతక్క‌కు ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఆమె శుభాకాంక్ష‌లు తెలిపారు.

200 కోట్ల కేసీఆర్ డబ్బును ఓడించింది నేను కాదు.. మా ములుగు ప్రజలు.. నా ప్రాణం వాళ్లది.. ములుగు నుండి మేడారం వరకు ర్యాలీగా వెళ్లి సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడం జరిగింది.. మార్గమధ్యలో ప్రతీ గ్రామం వేడుకలా స్వాగతించింది. రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు.