Singapuram Indira : తమ పార్టీ అభ్యర్థి గెలిచే వరకు అరగుండు, అరమీసం తోనే ఉంటా – కార్యకర్త శబదం

పార్టీని నమ్ముకున్న ఓ కార్యకర్త..తమ పార్టీ అభ్యర్థి గెలిచే వరకు అరగుండు , అరమీసం తో ఉంటానని శబదం చేసి వార్తల్లో నిలిచారు

Published By: HashtagU Telugu Desk
Singapuram Indira

Singapuram Indira

ఎన్నికల్లో నేతలే కాదు కార్యకర్తలు సైతం శబదంలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత రాజకీయాల్లో చాలామంది డబ్బు, పదవులు ఆశిస్తూ పనిచేస్తుంటారు. తమకు ఏ పార్టీ పదవులు ఇస్తుందో..కాంట్రాక్టులు ఇస్తుందో దానికి కొమ్ముకాస్తుంటారు. ఆలా ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీ జై కొడతారు..ఒకవేళ పదవులు ఇవ్వలేదో వేరే పార్టీ లోకి జంప్ అవుతారు. అయితే అందరు ఆలా ఉండరు. ప్రాణం పోయిన ఒకే పార్టీ ని నమ్ముకొని ఉంటారు. తాజాగా ఆలా పార్టీని నమ్ముకున్న ఓ కార్యకర్త..తమ పార్టీ అభ్యర్థి గెలిచే వరకు అరగుండు , అరమీసం తో ఉంటానని శబదం చేసి వార్తల్లో నిలిచారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం తెలంగాణ (Telangana) లో ఎన్నికల జోరు ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. పోలింగ్ సమయం దగ్గరపడుతుండడం తో అన్ని పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలతో , వాగ్దానాలతో ముందుకు సాగుతున్నారు. అలాగే కార్యకర్తలు సైతం తమ అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదిలా ఉంటె స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం (Station Ghanpur ) నుండి కాంగ్రెస్ తరుపున సింగపురం ఇందిరా (Congress MLA Candidate Singapuram Indira) బరిలోకి దిగింది. ఈమె విజయం కోసం ఓ కార్యకర్త వినూత్నంగా తిరుగుతున్నాడు. అరగుండు , అరమీసం చేయించుకొని ఇందిరా విజయం సాధించేవరకు అలాగే ఉంటానని శబదం చేసాడు. ప్రస్తుతం ఈయన పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇలాంటి కార్యకర్తలు ఉంటె..సదరు అభ్యర్థి గెలుపు ఖాయమని అంటున్నారు.

Read Also : Prakash Raj : దేశంలో బీజేపీని, తెలంగాణలో కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్న ప్రకాష్ రాజ్

  Last Updated: 14 Nov 2023, 03:04 PM IST