Site icon HashtagU Telugu

TS Poll : రాష్ట్రంలో కాంగ్రెస్ లూటీ స్టార్ట్ అయ్యింది – కేటీఆర్

Ktr Hzd

Ktr Hzd

రాష్ట్రంలో కాంగ్రెస్ హామీలు (Congress Guarantees) అమలు కాలేదు కానీ కాంగ్రెస్ లూటీ స్టార్ట్ అయ్యిందన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR). లోక్ సభ (Lok Sabha) ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కు మద్దతుగా హుజూరాబాద్‌లో కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..కరీంనగర్ పార్లమెంటు ఎన్నికలో పోటీ ఎవరెవరి మధ్య జరుగుతుందో ఆలోచించాలన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

పదేళ్ల నిజం కేసీఆర్ పాలన,పదేళ్ల విషం బీజేపీ పాలన, 150 రోజుల అబద్ధం కాంగ్రెస్ పాలన.. అన్నారు. పదేళ్ల క్రితం నేను ప్రధాని అయితే ఇంటింటికి 15 లక్షలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదన్నారు. ధరలు తగ్గిస్త అన్నాడు తగ్గియలేదని తెలిపారు. బీజేపీ అభివృద్ధి చేయలేదు కానీ రాముని గుడి కట్టిన్నం ఓటేయండి అంటున్నారని మండిపడ్డారు. గత పదేండ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఐదేండ్లలో బండి సంజయ్‌ గల్లీలో, ఢిల్లీలో ఎక్కడైనా కనిపించారా అని ప్రశ్నించారు. కరీంనగర్‌ అభివృద్ధికి బండి సంజయ్‌ కేంద్ర నిధులు తీసుకొచ్చారా అని నిలదీశారు. అమిత్‌షా చెప్పులు మోయడం తప్ప సంజయ్‌ ఒక్కపనైనా చేశారా అని ఎద్దేవా చేశారు. ప్రజల తరఫున పార్లమెంటులో గళం విప్పిన నాయకుడు వినోద్‌ కుమార్‌ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. ఆడ పిల్లలకు స్కుటీలు రాలేదు కానీ కాంగ్రెస్ నాయకుల లూటీ స్టార్ట్ అయిందన్నారు. దేవుళ్ళు లక్షల ఏళ్ల క్రితం పుడితే బీజేపీ పుట్టింది నలభై ఏళ్ల క్రితం అన్నారు. నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసి నిత్యావసర ధరలు పెంచిన ఘనుడు మోడీ అన్నారు. పన్నెండు పదమూడు ఎం పి లను గెలిపించండి రాబోయే ఆరు నెలల్లో రాష్ట్రాన్ని శాసించే స్థాయికి కేసీఆర్ వస్తారన్నారు. కేసీఆర్‌ పాలన ఎలా ఉంది.. కాంగ్రెస్‌ పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. ప్రలోభాలకు ప్రజలు లొంగవద్దని కోరారు.

Read Also : Arvind Kejriwal : దేశం కోసం 100 సీఎం పోస్టులనైనా వదిలేస్తా : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్