Lok Sabha Elections : T కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులు వీరేనా..?

  • Written By:
  • Publish Date - March 8, 2024 / 11:28 AM IST

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ బిజెపి 195 మంది కూడిన మొదటి లిస్ట్ ను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టగా ..కాంగ్రెస్ కూడా మొదటి జాబితాను రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతుంది. ఇక బిజెపి తెలంగాణ నుండి 09 మంది అభ్యర్థులను ప్రకటించగా..కాంగ్రెస్ కూడా మొత్తం17 లోక్ సభ నియోజక వర్గాల్లో దాదాపు 9 నుంచి11 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

తుది జాబితాలో పరిశీలనలో ఈ పేర్లు వినిపిస్తున్నాయి..

1. మహబూబ్‌గర్ : వంశీచంద్ రెడ్డి
2. చేవెళ్ల : సునీత మహేందర్ రెడ్డి
3. నిజామాబాద్ : టీ జీవన్ రెడ్డి
4. పెద్దపల్లి : గడ్డం వంశీకృష్ణ
5. సికింద్రాబాద్ : బొంతు రామ్మోహన్/ఆయన సతీమణి
6. మల్కాజ్ గిరి: చంద్రశేఖర్
7. జహీరాబాద్ : సురేష్ షెట్కార్
8. మెదక్ : నీలం మధు
9. నల్లగొండ : జానారెడ్డి/రఘువీర్ రెడ్డి
10. కరీంనగర్ : ప్రవీణ్ రెడ్డి
11. మహబూబాబాద్ : బలరాం నాయక్/ విజయ భాయ్ బానోతు
12. భువనగిరి : చామల కిరణ్ కుమార్ రెడ్డి/కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు
13. నాగర్ కర్నూల్ : మల్లు రవి/ సంపత్ కుమార్
14. ఖమ్మం : నందిని/ ప్రసాద్ రెడ్డి/ యుగంధర్
15. హైదరాబాద్: మస్కతి/ మరో మహిళ పేరు పరిశీలన
16. వరంగల్: డీ సాంబయ్య / బలమైన నేత కోసం ఎదురుచూపు
17.ఆదిలాబాద్: పార్టీకి చెందిన సీనియర్ నేత

ఇక వీరిలో మొదటి జాబితాలో 11 మందిని ఖరారు చేయబోతుంది కాంగ్రెస్. ఇక బిజెపి ప్రకటించిన మొదటి జాబితాలో తెలంగాణ నుండి బరిలోకి దిగే వారు మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ , కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్, సికింద్రాబాద్ నుంచి జి. కిషన్ రెడ్డి , నిజామాబాద్ నుంచి అరవింద్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, హైదరాబాద్ నుంచి మాధవిలత, చెవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి భరత్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ పేర్లను ప్రకటించారు.