Site icon HashtagU Telugu

Telangana Congress: దసరా నాటికి కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు

Telangana Congress

Telangana Congress

Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వస్తోంది. కొద్ది రోజులుగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భిన్నాభిప్రాయాలు, భిన్న వాదనల మధ్య 70 నియోజకవర్గాల్లో స్క్రీనింగ్ పూర్తి చేశారు. నలభైకి పైగా స్థానాలకు ఒక అభ్యర్థి పేరు, మరో 30 స్థానాలకు ఇద్దరి పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం.

ఇద్దరి పేర్లను ఎంపిక చేసిన నియోజకవర్గాల సర్వేల ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేసే అధికారాన్ని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి అప్పగించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సర్వేల ఆధారంగా మిగతా అన్ని స్థానాల్లోనూ షార్ట్ లిస్టింగ్ ఖరారైందని అంటున్నారు. అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన వరుసగా రెండో రోజు ఢిల్లీలో నేతల సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిరావు ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తదితరులు పాల్గొన్నారు.

గురువారం జరిగిన సమావేశంలో 35 స్థానాల అభ్యర్థులను ఖరారు చేసిన కమిటీ.. శుక్రవారం ఐదు గంటల పాటు చర్చించి మరో 5 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి మరో 30 స్థానాలకు వడపోత పూర్తి చేసింది. రాజకీయ, కుల సమీకరణాలు, ప్రభుత్వ రంగంలో బలాబలాలు, సర్వే నివేదికల ఆధారంగా ఈ 30 స్థానాల్లో ఇద్దరు నేతలను ఎంపిక చేశారు. ఎల్‌బీనగర్, చేవెళ్ల, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్, శేరిలింగంపల్లి, బోథ్, ఖానాపూర్, కరీంనగర్, డోర్నకల్, మహబూబాబాద్, పరకాల, జనగాం, వర్ధన్నపేట, వనపర్తి, నారాయణపేట్, నకిరేకల్, తుంగతుర్తి, నర్సాపూర్, దుబ్బాక, నారాయణపేట, నారాయణపేట, నారాయణ్‌పేట, నారాయణ్‌పేట. ఎల్లారెడ్డి, బాన్సువాడ, మునుగోడు, సికింద్రాబాద్, హుస్నాబాద్ వంటి నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలిన 50 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు మరోసారి కమిటీ సమావేశం కానుందని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ దసరా నాటికి కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది.

Also Read: Five Eyes: ‘ఫైవ్ ఐస్’ అంటే ఏమిటి.. దీని ఉద్దేశం ఏంటి?