Site icon HashtagU Telugu

Medigadda Project : రేపు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

Congress Leaders Visit Medi

Congress Leaders Visit Medi

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణ లోపంపై ప్రభుత్వం (Congress Govt) ఛలో మేడిగడ్డ (Medigadda Project)కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రేపు ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో ప్రజాప్రతినిధులు మేడిగడ్డకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. పరిశీలన అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ముఖ్యమంత్రి.. అధికారులతో రివ్యూ చేస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

తర్వాత సాయంత్రం 5 గంటలకు మేడిగడ్డ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. రాత్రి 9.30 గంటలకు ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్ సహ విపక్షాల ఎమ్మెల్యేలను కూడా లేఖల ద్వారా ఆహ్వానించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఎమ్మెల్యేలు ప్రాజెక్టుపై చేసిన సూచనలు, సలహాలను ప్రభుత్వం ఖచ్చితంగా స్వీకరిస్తుందని అన్నారు. తెలంగాణకు రావాల్సిన కేటాయింపులపై పోరాడతామని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు.

ఇప్పటికే మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఓసారి సందర్శించింది. మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ వంగడం, అన్నారం బ్యారేజ్‌లో డిజైన్ లోపాలను ఎత్తి చూపటంపై ప్రధానంగా వారు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Read Also : Bharat Ratna for NTR : ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ ఎంపీ లేఖ..