Congress Leaders Protest : రోడ్డు పై బైఠాయించిన సీఎం రేవంత్

Congress Leaders Protest : ఈ ర్యాలీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు ఇతర కీలక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు

Published By: HashtagU Telugu Desk
Congress Leaders Protest

Congress Leaders Protest

కేంద్ర ప్రభుత్వం (Central Govt)అదానీ వ్యవహారం (Adani Issue) మరియు మణిపుర్ పరిస్థితులపై స్పందించాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ నుండి రాజ్ భవన్ (Rajbhavan) వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు ఇతర కీలక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అదానీ అంశంపై కేంద్రం అనుమానాస్పద మౌనాన్ని అవలంబిస్తుందని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి రాజ్ భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు.

ఈ సందర్భంగా.. “మోదీ-అదానీ ఏక్ హై” అంటూ నినాదాలు చేశారు. అదానీ వ్యవహారంపై ప్రత్యేక సమీక్ష కమిటీ ఏర్పాటు చేయాలని, అలాగే మణిపుర్ సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఈ ఆందోళనలో అదనంగా స్థానిక సమస్యలపై కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. రైతు సమస్యలు, మహిళల భద్రత, యువతకు ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు. ఇవి కూడా కేంద్రం పాలనకే సంభందించిన సమస్యలని రేవంత్ స్పష్టం చేశారు. ఈ ఆందోళన సందర్భంగా పోలీసు యంత్రాంగం ఆందోళనకారులను అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంది. రాజ్‌భవన్‌కి చేరడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

Read Also : Fees Reimbursement : త్వరలో ఫీజు బకాయిలు చెల్లిస్తాం: భట్టి విక్రమార్క

  Last Updated: 18 Dec 2024, 01:42 PM IST