Khammam : పొంగులేటి ఎదుట గొడవకు దిగిన కాంగ్రెస్ నేతలు

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్లో వర్గ పోరు భగ్గుమంది

  • Written By:
  • Publish Date - May 2, 2024 / 08:38 PM IST

లోక్ సభ ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ పార్టీ లో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. మొన్నటి వరకు నేతల మధ్య విభేదాలు బయటపడగా..అవి కాస్త చల్లపడ్డాయి అని అంత అనుకుంటున్నా తరుణంలో ఇప్పుడు లోకల్ నేతలు..గొడవ పడుతున్నారు. మంత్రుల ఎదుటనే ఒకరిపై ఒకరు విమర్శలు , కుర్చీలు విసురుకోవడం , తిట్టుకోవడం చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్లో వర్గ పోరు భగ్గుమంది. ఖమ్మం లోక్ సభ MP అభ్యర్థి రఘురాంరెడ్డి ప్రచారంలో భాగంగా దమ్మాయిగూడెంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ రసాభాసగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ ప్రచారంలో సుబ్లేడ్ గ్రామానికి చెందిన రామ సహాయం నరేష్ రెడ్డి ప్రసంగించవద్దని బీరోలు గ్రామానికి చెందిన విక్రమ్ రెడ్డి అనుచరులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెప్పారు. అయితే… నరేష్ రెడ్డి ప్రసంగిస్తే మండలంలో ఓట్లు పడవని, అతన్ని దూరం పెట్టాలని చెప్పడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. మంత్రి పొంగులేటి ఎదుటనే ఈ గొడవ జరగడం తో నేతలు కూడా షాక్ అయ్యారు. కాసేపు ఉద్రిక్తత తర్వాత నేతలు ఇరు వర్గాల వారిని శాంతిప చేసారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

Read Also : Side Effects of AC : వేడి తట్టుకోలేక ఏసీలోనే ఉంటున్నారా ? ఈ సమస్యలు వస్తాయ్ జాగ్రత్త !