దేశవ్యాప్తంగా కులగణన(Caste Survey)కు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ (Congress Party) వర్గాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. హైదరాబాద్‌లో గాంధీ భవన్ (Gandhi Bhavan) వద్ద కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. టపాసులు పేల్చుతూ, డప్పు చప్పుళ్ల మధ్య డాన్సులు చేస్తూ, బాటిళ్లతో పాలాభిషేకాలు చేస్తూ నేతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ తమ అభిమానాన్ని సంతోషాన్ని వ్యక్తం చేసారు.
‘WAVES’ సమ్మిట్ కు హాజరైన మెగాస్టార్ చిరంజీవి
కులగణనకు సంబంధించిన ఈ నిర్ణయం సామాజిక న్యాయ పరంగా ఎంతో కీలకమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. మహిళలకు, దళితులు, మైనారిటీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలంటే కులగణన తప్పనిసరి అని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న కులగణన ప్రక్రియను దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాహుల్ గాంధీ కోరిన నేపథ్యంలో, కేంద్రం కూడా ఇప్పుడు అదే దిశగా అడుగులు వేయడం కాంగ్రెస్‌కు విజయంగా పరిగణిస్తున్నారు.
ఈ సందర్బంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రతిపాదించిన “జితా హక్క్” సిద్ధాంతం , జనాభాకు అనుగుణంగా పాలనా వాటా , ఇప్పుడిప్పుడే ఫలప్రదమవుతోందని చెప్పారు. కులగణన దేశంలో వాస్తవిక పరిస్థితులను వెలికి తీయడానికి, అనామకంగా ఉన్న సామాజిక వర్గాలకు మేలు కల్పించడానికి కీలకం అని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది.