Congress leaders attacked KTR car..!: హైదరాబాద్‌లోని మూసి పరివాహక ప్రాంతాలలో బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని.. అడ్డుకొని… దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కాంగ్రెస్ నేతలను.. కేటీఆర్ అనుచరులు ఆడుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. అయితే దీనిపై గులాబీ నేతలు ఫైర్ అవుతున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తే కూడా తప్పిదమా ? పెద్ద నేరంగా భావించి ఇలా దాడులు చేయడం కరెక్టేనా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న కేటీఆర్ కారుపై దాడి. #KTR #HYDRADemolitions #HYDRAA #Telangana #Hyderabad #Musiriver #HashtagU pic.twitter.com/VRE4LfI9zr
— Hashtag U (@HashtaguIn) October 1, 2024
అనంతరం మూసీ రివర్ బెల్ట్ లో ఉన్న గోల్నాక డివిజన్ పరిధిలోని తులసి రామ్‌నగర్‌లో పర్యటించి అక్కడున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లో లక్షలాది మందికి ప్రభుత్వం నిద్ర లేకుండా చేస్తుందని ఆరోపించారు. ఎవరు ఎప్పుడొచ్చి ఇళ్లను కూల్చుతారో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఆవేదనలో ఉన్నారని తెలిపారు. ‘మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాంటో’ అన్నట్లుగా కాంగ్రెస్ నినాదం ఉందని ఎద్దేవా చేశారు.
Read Also:Musi : మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇండ్ల కూల్చివేతలు ప్రారంభం..
గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో బీఆర్ఎస్ కు ఓట్లు వేసిన వారిపై సీఎం రేవంత్‌రెడ్డి పగబట్టారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్‌లో సగం డబ్బులతో సర్కార్ మూసీ ప్రక్షాళణ చేపడుతోందని అన్నారు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంత వాసులను అడవిలోకి పంపుతున్నారని ధ్వజమెత్తారు. ఇక నుంచి ఎవరింటికైనా.. బుల్డోజర్ వస్తే కంచెలు అడ్డుపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లను కడతామని చెప్పిన ప్రభుత్వం.. ఏకంగా ఇళ్లనే కూల్చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు.