Congress Leader Shobha Rani Warning To Padi Kaushik Reddy : కాంగ్రెస్ – బిఆర్ఎస్ పార్టీల మధ్య ఫిరాయింపు ఫైటింగ్ తారాస్థాయికి చేరింది. బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు (Disqualification Of MLAs ) వేసేలా ఆదేశాలివ్వాలని బిఆర్ఎస్ , బీజేపీలు హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు సోమవారం (High Court Verdict) తీర్పునిచ్చింది. నాలుగు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతామంది.
ఆ 10 మంది ఎమ్మెల్యేలు చీర , గాజులు వేసుకొని తిరగాలి
హైకోర్టు తీర్పు తో బిఆర్ఎస్ పార్టీ..ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మరింత దూకుడు పెంచారు. బుధువారం తెలంగాణ భవన్ లో హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) కీలక వ్యాఖ్యలు చేసారు. బిఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 ఎమ్మెల్యేలు చీర , గాజులు తొడుక్కోవాలని…వీరికి చీర, గాజులు పంపుతున్నానని..కౌశిక్ అన్నారు. వారంతా ఆ చీర గాజులు వేసుకుని పబ్లిక్ లో తిరగాలని సూచించారు.
మహిళల్ని కించ పరిచేలా మాట్లడితే చెప్పుదెబ్బలే
కౌశిక్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను మహిళలను కించపరిచేలా ఉండంతో కాంగ్రెస్ మహిళా నేతలు గాందీ భవన్ (Gandhi Bhavan) లో ప్రెస్ మీట్ పెట్టి పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చీర, గాజులు పంపడం అంటే ఏమిటని.. మహిళలను చేత కాని వాళ్లగా చెబుతున్నారా అని ప్రశ్నించారు. మహిళల్ని కించ పరిచేలా మాట్లడితే చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి (Congress Leader Shobha Rani)పాడి కౌశిక్ రెడ్డికి షూ చూపించారు.
పాడి కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలి
మరోసారి చీరలు గాజులు చూపిస్తే కౌశిక్ రెడ్డి చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుందని హెచ్చరించారు. మిస్టర్ కౌశిక్ రెడ్డి.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మహిళలను అవమానించేలా బీఆర్ఎస్ నేతలు పదే పదే మాట్లాడటం వల్లే తాము చెప్పు చూపించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని అలాగే, పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని ఆయనను విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు.
కౌశిక్ దూకుడు బిఆర్ఎస్ కు కొత్త సమస్యలు
పాడి కౌశిక్ రెడ్డికి పాడె ఎక్కే సమయం వచ్చిందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మండిపడ్డారు. భార్య, కుమార్తెలతో ఆత్మహత్యలు చేసుకుంటానని బెదిరించి కౌశిక్ రెడ్డి గెలిచాడని అన్నారు. కౌశిక్ వెంటనే క్షమాపణలు చెప్పాలని..చెప్పే వరకూ మహిళలతో నిరసనలు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇటు కౌశిక్ తీరు ఫై బిఆర్ఎస్ నేతలు సైతం కాస్త ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తుంది. కౌశిక్ రెడ్డి వ్యవహారం బీఆర్ఎస్ కు మొదటి నుంచి ఇబ్బందిగానే మారింది. ఆయన దూకుడు పార్టీకి ఏ మాత్రం మేలు చేయకపోగా కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇప్పుడు పార్టీలకు అతీతంగా మహిళా నేతలంతా మండిపడేలా ఆయన వ్యాఖ్యలను.. సొంత పార్టీ మహిళా నేతలు కూడా సమర్థించే అవకాశం లేకుండా పోయింది. మొత్తం మీద కౌశిక్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదం అవుతున్నాయి.
Read Also : 2013 Serial Blasts : నలుగురు నిందితుల మరణశిక్షలను జీవిత ఖైదుగా మార్చిన పాట్నా హైకోర్టు