Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇవాళ (మంగళవారం) అకస్మాత్తుగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. ఇంతకీ ఎందుకు ? అనే దానిపై పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇంతకీ రాహుల్ సడెన్ టూర్ ఎందుకు ? ఈ విజిట్ వివరాలేంటి ?
Also Read :Bus Accident: మురుగు లోయలో పడిన బస్సు.. 55 మంది మృతి
రాహుల్ టుడే టూర్..
- రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ఈరోజు(మంగళవారం) సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు విమానంలో చేరుకుంటారు.
- అక్కడి నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌కు చేరుకుంటారు.
- వరంగల్‌లోని హన్మకొండ నగరంలో ఉన్న సుప్రభ హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.
- అనంతరం హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో రాహుల్ సమావేశం అవుతారు.
- బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాల్లో తెలంగాణ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని రాష్ట్ర సర్కారు చెబుతోంది. ఈ అంశాల్లో ప్రజా స్పందన ఎలా ఉందనే దానిపై రాహుల్‌గాంధీ ఆరా తీయనున్నారు.
- ఈరోజు రాత్రి 7.30 గంటలకు వరంగల్ నుంచి రైలులో చెన్నైకి రాహుల్ బయలుదేరి వెళ్తారు.
- కేంద్ర ప్రభుత్వం రైల్వేలను ప్రైవేటీకరించే యత్నం చేస్తోందని రాహుల్ అంటున్నారు. ఈ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి ఆయన అభిప్రాయాలను సేకరించనున్నారు.
- కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం రెడ్డి, ఎస్టీ కోటాలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు కాంగ్రెస్ సీనియర్ నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో కనీసం ఒకరికి ఆ పదవి దక్కుతుందని అంచనా వేస్తున్నారు.
- వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‍రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్‍లు రాహుల్‌గాంధీని వరంగల్‌లో కలిసే అవకాశం ఉంది. పార్టీ పదవుల కేటాయింపులో తమ పేర్లను పరిశీలించాలని విన్నవించే ఛాన్స్ ఉంది.
ప్రధాన పోటీ వీరి మధ్యే..
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాల నుంచి నలుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్‍లుగా నియమింంచాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ పదవుల రేసులో భువనగిరి ఎంపీ చామల కిరణ్‍కుమార్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిణ్‍రెడ్డి, రాష్ట్ర గిరిజన డెవలప్‍మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ కూడా ఉన్నారు. ఎస్టీ కోటాలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, తేజావత్ బెల్లయ్య నాయక్ మధ్య పోటీ నెలకొంది. రెడ్డి కోటాలో చామల కిరణ్‍కుమార్ రెడ్డి, నాయిని రాజేందర్‍రెడ్డి మధ్య పోటీ నెలకొంది.