Jana Reddy: టీ కాంగ్రెస్ నేత జానారెడ్డికి అస్వస్థత

టీ కాంగ్రెస్ నేత, సీనియర్ నాయకుడు జానారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున జానారెడ్డికి ఛాతిలో నొప్పి రావడంతో

Published By: HashtagU Telugu Desk
Jana Reddy

Jana Reddy

Jana Reddy: టీ కాంగ్రెస్ నేత, సీనియర్ నాయకుడు జానారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున జానారెడ్డికి ఛాతిలో నొప్పి రావడంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. వివరాలలోకి వెళితే…

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి ( Jana Reddy ) అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రాడంతో కుటుంబ సభ్యులు ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన యశోద వైద్య బృందం గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళం పూడుకుపోయిందని తెలిపారు. కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుని స్టంట్ వేసినట్లు వైద్యబృందం తెలిపింది. ప్రస్తుతం జానారెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు డాక్టర్లు. జానారెడ్డి ఆరోగ్యంపై పలువురు నేతలు ఆరా తీశారు. ఇక ఆయన ఆరోగ్యంపై అభిమానులు టెన్షన్ పడ్డారు. అభిమాన నాయకుడు ఆస్పత్రి పాలవ్వడంతో త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధించారు.

Read More: Telangana Political Party:TRS పార్టీ అధ్యక్షుడిగా పొంగులేటి ?

  Last Updated: 12 Apr 2023, 12:04 PM IST