Exclusive : బీజేపీకి అతి పెద్ద కోవర్ట్ ఎంఐఎం పార్టీ..!!

తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అనగానే ఎవరికైనా మొదటగా గుర్తుకువచ్చేది రేవంత్ రెడ్డియే. కానీ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి తిరగేస్తే.. ఫిరోజ్ ఖాన్ లాంటివాళ్లు డైనమిక్ అండ్ డేరింగ్ డ్యాషింగ్ లాంటి నేతలు కళ్లముందు కదలాడుతారు.

  • Written By:
  • Updated On - December 4, 2021 / 09:04 AM IST

తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అనగానే ఎవరికైనా మొదటగా గుర్తుకువచ్చేది రేవంత్ రెడ్డియే. కానీ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి తిరగేస్తే.. ఫిరోజ్ ఖాన్ లాంటి డైనమిక్ అండ్ డేరింగ్ డ్యాషింగ్ లాంటి నేతలు కళ్లముందు కదలాడుతారు. ఏ విషయాన్నైనా కుండబద్ధలు కొట్టేలా… ఎంతటివారినైనా విమర్శించడానికి వెనుకాడని నైజం ఫిరోజ్ ఖాన్ సొంతం. గత ఎన్నికల్లో నాంపల్లి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకమారు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా తగ్గేదే అంటూ మళ్లీ పోటీలో నిలుస్తుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంది? ముస్లింలకు ఎంఐఎం చేస్తున్న అన్యాయాలు? దేశంలో మోడీ పాలన ఎలా ఉంది? లాంటి సంచలన విషయాలను ‘హ్యష్ ట్యాగ్ యూ’ తో పంచుకున్నారు. ఆ విశేషాలే ఇవి..

కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి కలయిక తో కాంగ్రెస్ లో జోష్ పెరిగిందని అనుకోవచ్చా?

ఇద్దరు సింహాలు కలిస్తే ఎలాగో ఉంటుందో.. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ లో యూనిటీ లేదనుకున్నవాళ్లకు, యూనిటీ ఏంటో చూపించారు. ఒకే వేదికపై కనిపించి  ఇతర పార్టీల నేతల నోళ్లు మూయించారు. ఇక నుంచి సీనియర్స్ అందరూ రేవంత్ వెంటే ఉంటారు. అయితే రాజకీయాల్లో ఎవరికైనా ఇగో చాలా కామన్. కోమటిరెడ్డి కూడా ఇగో వల్ల కలువలేకపోయారు. ఇప్పుడు అసలైన కాంగ్రెస్ పార్టీ ఎంటో చూస్తారు. కోమటిరెడ్డి రాకతో కాంగ్రెస్ పటిష్టమవుతుంది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం.

ఒకవేళ హైదరాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే.. మీరు బీజేపీలోకి వెళ్తారా?

బరాబర్ వెళ్తా. చాలాసార్లు అడిగాను నేను. బట్ బీజేపీవాళ్లు ఇవ్వడం లేదు. ఒకవేళ నేను పోటీ చేస్తే హిందూ, మైనార్టీలు ఓట్లు నాకే పడతాయి. కాబట్టి బీజేపీ టికెట్ ఇస్తే కచ్చితంగా వెళ్తా. కానీ బిజేపీ టికెట్ ఇవ్వదు. ఎందుకంటే ఎంఐఎం, బీజేపీ రెండుపార్టీలు ఒక్కటే. ఇక్కడ కొట్లాడుకుంటారు.. అక్కడ మంచిగుంటరు. అమిత్ షా పర్మిషన్ లేనిదే అసదుద్దీన్ ఏ పని చేయ్యరు. బీజేపీకి అతి పెద్ద కోవర్ట్ ఎంఐఎం పార్టీ. అందుకే అసదుద్దీన్ కు కేంద్రం ఫుల్ సపోర్ట్ ఉంటుంది.

మమతా బెనర్జీ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుచేయబోతుంది కదా.. యూపీఏ కాదనీ, కేసీఆర్ వైపు చూస్తోంది. దీనిపై మీ రియాక్షన్!

మమతా బెనర్జీకి ధిమాక్ ఖరాబ్ అయ్యింది. కేసీఆర్ కూడా థర్డ్ ఫ్రంట్ అని జబ్బలు చర్చుకున్నడు. చివరకు మూలన పడ్డడు. ఈమె పరిస్థితి అలాగే ఉంటంది. ఫస్ట్ పశ్చిమ బెంగాల్ ను డెవలప్ మెంట్ చేసి చూపించమను. ఆ తర్వాత థర్డ్ ఫ్రంట్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది. మూడు సార్లు గెలిచేసరికి మమతాకు కొమ్ములొచ్చాయి. అయితే మొత్తం (545) లోక్ స్థానాల్లో కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం కష్టం. అందరూ కలిస్తే కేవలం 150 సీట్లు మాత్రమే వస్తాయి. ఆ చిన్న లాజిక్ మమతా బెనర్జీకి తెలియదా?

దేశంలో మోడీ పాలన ఉంది.. ప్రధానమంత్రిగా ఆయన సక్సెస్ అయ్యారా?

నరేంద్ర మోడీ ఓ దొంగ. ఎప్పుడూ అబద్దాలు చెప్తూ, తిరుగుతుంటాడు. మోడీ తీసుకొచ్చిన బిల్లులు ఎవరికీ ఉపయోగ పడవ్. ప్రజలకు ఆగమాగం చేస్తుండు. వ్యవసాయ చట్టాలు ఎవరికీ ఉపయోగపడ్డాయి? ఎందుకు ఉపయోగపడలేదు? మోడీ, అమిత్ షా ఇద్దరు దొంగలు. కాకపోతే మోడీ 24 గంటలు ప్రజాక్షేత్రంలో ఉండటం బాగా కలిసివస్తోంది. ఈ విషయంలో మోడీని ఇన్ స్పిరేషన్ గా తీసుకోవచ్చు.

హుజూరాబాద్ లో ఈటలకు ఎందుకు సపోర్ట్ చేశారు?

కాంగ్రెస్ లో ఎంత పెద్ద తోపు పోటీ చేసినా అక్కడ కచ్చితంగా ఓడిపోతరు. అందుకే కాంగ్రెస్ ఓడిపోతదని చెప్పా. నేను ఒక్కడినే కాదు.. మా సీనియర్లు కూడా అదే విషయం చెప్పారు. ఇందుకు ఎలాంటి క్రమశిక్షణ నోటీసులు ఇచ్చినా నేనూ రెడీ. కానీ బల్మూర్ వెంకట్ చాలా కష్టపడ్డారు. ఆ విషయంలో నేను మెచ్చుకుంటున్నా. ఈటల బీజేపీ అభ్యర్థిగా గెలవలేదు. ఆయన వ్యక్తిగతంగా గెలిచాడు. అది బిజేపీ గెలుపు కాదు.. ఈటల గెలుపుగా పరిగణించాలి.

రేవంత్ తో మీ సత్ససంబంధాలు ఎలా ఉన్నాయి?

రేవంత్ రెడ్డికి ఎప్పుడూ ప్రజల్లో ఉండటం ఇష్టం. చాలా కష్టపడతాడు. నేనూ ఎప్పుడూ ప్రజల్లో ఉంటా. కష్టపడ్తా. రేవంత్ కు డేరింగ్ డ్యాష్ ఎక్కువ. ఆయన జైలుకెళ్లిండు.. నేను కూడా వెళ్లా. ఆయన పెద్ద, నేను చిన పులి. తెలంగాణకు రేవంత్ రెడ్డి, హైదరాబాద్ కు ఫిరోజ్ ఖాన్. ఆసారి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తే నాంపల్లి ఎమ్మెల్యేగా గెలితీరుతా. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారిగా ఎంపీగా ఓడిపోయా.. పైసలన్నీ పొగొట్టుకున్నా.. రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తే కచ్చితంగా గెలుస్తా.

ఎంఐఎం పార్టీ అంటే మీకు ఎందుకు కోపం?

ఎంఐఎం పార్టీ ఒకచెత్త పార్టీ. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల కాళ్లు మొక్కుతరు. అప్పుడు మా రాజశేఖరెడ్డి కాళ్లు మొక్కారు. ఇప్పుడు కేసీఆర్ కాళ్లు మొక్కుతున్నారు. రేపు బీజేపీ వస్తే.. వాళ్ల కాళ్లు కూడా మొక్కుతారు. బీజేపీ, ఎంఐఎం రెండు పార్టీలూ ఒక్కటే. ఎంఐఎం నాయకులు ముస్లింలను మోసం చేస్తున్నారు. డెవలప్ మెంట్ లేదు. దొంగ ఓట్లతో గెలుస్తున్నారు. ఒకప్పుడు ఓ ఇంట్లో అద్దెకు ఉండేవాళ్లు.. హైదరాబాద్ లో సగం ఆస్తులు వాళ్లవే. రియల్ ఎస్టేట్ చేసి సంపాయించారు. కబ్జాలు చేయడంలో వీళ్ల తర్వాతనే ఎవరైనా!

ఇంటర్వ్యూ : రాజు