Feroz Khan: కేఏ పాల్ మాకు పోటీయే కాదు!

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపినట్టయింది.

  • Written By:
  • Updated On - May 14, 2022 / 12:15 PM IST

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపినట్టయింది. రాహుల్ రాకతో టీకాంగ్రెస్ పనితీరు ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ కార్యాచరణ ఏమిటీ? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? లాంటి విషయాలను కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ‘హ్యాష్ ట్యాగ్ యూ’ షేర్ చేసుకున్నారు. ఆ వివరాలే ఇవి.

వరంగల్ సభతో కాంగ్రెస్ లో జోష్ నింపినట్టయింది కదా.. దీనిపై మీరేమంటారు?

రాహుల్ గాంధీ రావడం వల్ల కాంగ్రెస్ కు చాలా ప్లస్ అయ్యింది. రాహుల్ చెప్పిన ఒక్క మాట నాకు బాగా నచ్చింది. తెల్ల దుస్తులు ధరించినవాళ్లంతా లీడర్లు కాదు.. ప్రజల్లో తిరిగేవాళ్లే లీడర్లు. ఇక ఇప్పట్నుంచి కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళ్తారు. బిర్యానీలు తిని, ఇరానీ చాయ్ తాగి కాలక్షేపం చేసేవాళ్లకు చెక్ పెట్టినట్టయింది. రాహుల్ వ్యాఖ్యలు నాలాంటివాళ్లకు ప్రయోజనం చేకూర్చినట్టయింది. ప్రతిఒక్కరూ కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా. అలా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు.

కేఏ పాల్ అమిత్ షా ను కలవడం వల్ల కాంగ్రెస్ కు ప్లసా.. మైనస్సా?  

కేఏ పాల్ ఓ జోకర్. ఆయన్ను ఎవరూ కూడా లెక్కల్లోకి తీసుకోరు. ఇప్పటివరకు వార్డు మెంబర్ ను కూడా గెలిపించుకోలేకపోయాడు. ఆయన లీడర్ అంటే నవ్వుస్తోంది. కేఏ పాల్ పోటీయే కాదు. దమ్ముంటే ఒక సీటైనా గెలుపించుకొని నిరూపించుకోవాలి. అప్పుడే ఆయనను జనం నమ్ముతారు.

పాదయాత్రకు రాహుల్ గాంధీ ఎందుకు మొగ్గు చూపడం లేదు. కారణం ఏంటి?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కావాల్సిన డబ్బు ఉంది. అదానీ, అంబానీలు డబ్బు ఇస్తారు కాబట్టే పాదయాత్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ వద్ద పార్టీ ఫండ్ లేదు. ఒక్కరోజు పాదయాత్రకు రూ. 40 నుంచి 50 లక్షలు ఖర్చు అయితది. ఇప్పట్నుంచే ప్రజల్లో తిరిగితే ప్రజలు మరిచిపోయే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో తిరిగితేనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు.

నాంపల్లిలో ఇసారైనా గెలుస్తారా?

వచ్చే ఎన్నికల్లో నాంపల్లి గెలిచి తీరుతా. అందుకోసమే 25 కోట్లు కూడా పెట్టుకున్నా. ఇదంతా కష్టపడి పనిచేసే సంపాదించింది. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. పైసా లేనిదే రాజకీయం చేయలేం. యువతకు నేను చెప్పెదీ కూడా ఇదే.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరంగల్ సభకు రాకపోవడానికి కారణం

రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీ మారడు. కాకపోతే ఆయన ఈగో ఉంది. రాహుల్, సోనియా పిలిచి మాట్లాడితే కాంప్రమైజ్ అవుతారు. కో ఆర్డినేషన్ లేకనే విబేధాలు తలెత్తుతున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారే ప్రసక్తే ఉండదు.