Site icon HashtagU Telugu

T congress : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి టీ కాంగ్రెస్ నేత అద్దంకి ద‌యాక‌ర్ లేఖ‌.. అధికారంలోకి రావాలంటే..?

Congress

Congress

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కార్యాచరణను ముమ్మరం చేసేందుకు సిద్ధమైంది. పార్టీ సీనియర్ నేతలు ఏఐసీసీ నేతలు, పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రేతో వరుస సమావేశాల్లో మునిగితేలుతుండగా, కొందరు పార్టీ నేతలు న్యూఢిల్లీలో అగ్రనాయకత్వాన్ని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి రావాలంటే తొమ్మిది సూత్రాల‌ను పాటించాల‌ని టీపీసీసీ నేత అద్దంకి ద‌యాక‌ర్‌.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. అమరవీరుల కుటుంబాలను ఉద్యమ కారులను హక్కును చేర్చుకోవాలని ఆయ‌న లేఖ‌లో ప్ర‌స్తావించారు. పార్టీని నమ్ముకొని ఉన్న‌ నేతలకు, క్యాడ‌ర్‌కు ఆత్మ‌విశ్వాసం క‌ల్పించాల‌న్నారు. రైతులకు 2లక్షలు రుణమాఫీ ఇస్తామని మీరే స్వ‌యంగా చెప్పి ప్ర‌చారం చేయాల‌ని లేఖ‌లో తెలిపారు.బీఆర్ఎస్‌, బీజేపీ రెండూ ఒక్క‌టై కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నాయ‌ని తెలిపారు. పీసీసీ , సీఎల్పీ ని గైడ్ చేయాల‌ని కోరారు. నిరుద్యోగులకు భరోసా ఇచ్చేలా మేనిఫెస్టోలో పెట్టాల‌ని.. గెలిచాక పార్టీని వీడకుండా ఉండే నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని సోనియాగాంధీని కోరారు. టికెట్ల కేటాయింపు విషయంలో నమ్మకం ఉన్న నేతలకే టికెట్ల కేటాయింపు జరగాలన్నారు,