Congress Vs BJP : ‘‘బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు’’.. కాంగ్రెస్ వినూత్న ప్రచారం షురూ

Congress Vs BJP :  తెలంగాణకు బీజేపీ సారథ్యంలోని  కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ‘గాడిద గుడ్డు’ ప్రచార కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికగా ప్రారంభించింది.

  • Written By:
  • Updated On - April 29, 2024 / 02:38 PM IST

Congress Vs BJP :  తెలంగాణకు బీజేపీ సారథ్యంలోని  కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ‘గాడిద గుడ్డు’ ప్రచార కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికగా ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రం ఏమేం అడిగింది ? బీజేపీ ఏమేం ఇచ్చింది ? ఇచ్చింది గాడిద గుడ్డే అంటూ బ్యానర్లను ఏర్పాటు చేశారు. గాంధీ భవన్‌లో ఈ  ప్రచార కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి, అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు.

We’re now on WhatsApp. Click to Join

బ్యానర్లలో ప్రస్తావించిన కీలక అంశాలివీ.. 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మొండిచెయ్యి ఇచ్చిన అంశాల జాబితాలో ఆ బ్యానర్లలో(Congress Vs BJP) ప్రస్తావించారు. దాని ప్రకారం..  తెలంగాణ నుంచి పన్ను ఆదాయంగా రూ.1 పంపిస్తే.. 43 పైసలు వెనక్కి ఇస్తామని ఇచ్చిన హామీని కేంద్రంలోని బీజేపీ సర్కారు నిలుపుకోలేకపోయిందని ప్రస్తావించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇస్తామని  బీజేపీ సర్కారు బుకాయించి, మాట తప్పిందని పేర్కొన్నారు. మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరకు జాతీయ హోదాను ఇస్తామని బీజేపీ సర్కారు బుకాయించి.. మాట దాటవేసిందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటాను తెలంగాణ ఇస్తామని చెప్పి.. బీజేపీ సర్కారు మోసం చేసిందన్నారు. కనీసం ఒక్క ఐఐఎం, ఎన్ఐడీ విద్యా సంస్థను కూడా తెలంగాణకు బీజేపీ సర్కారు కేటాయించలేదని కాంగ్రెస్ పార్టీ బ్యానర్లలో రాశారు.

Also Read : Akshay Kanti Bam : బీజేపీలో చేరిన కాంగ్రెస్ అభ్యర్థి.. నామినేషన్ విత్‌డ్రా

‘గాడిద గుడ్డు’ ప్రచార కార్యక్రమ బ్యానర్లలో ఇంకా ఏమున్నాయ్.. 

  • 811 టీఎంసీ కృష్ణా జలాలలో సరైన వాటాను తెలంగాణకు దక్కేలా చేయడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు విఫలమైంది.
  • తెలంగాణకు కనీసం ఒక్క ఐఐటీ, మెడికల్ కాలేజీని కూడా కేంద్ర సర్కారు కేటాయించలేదు.
  • బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా కేంద్ర సర్కారు చొరవ చూపలేకపోయింది.
  • కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని బుకాయించడమే తప్ప.. దానిపై ఎలాంటి విధానపరమైన నిర్ణయాలను బీజేపీ సర్కారు తీసుకోలేకపోయింది.
  • వరంగల్, కరీంనగర్‌లను స్మార్ట్ సిటీలుగా చేస్తామని ఇచ్చిన మాటను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పింది.

Also Read :Maa Oori Polimera 2 : దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌కు.. మా ఊరి పొలిమేర 2..