BRS vs Congress : బుద్వేల్ భూముల వేలంపై కాంగ్రెస్ ఆగ్ర‌హం.. భూములు కొన్న‌వారంతా…?

ఇందిరా గాంధీ భూ సంస్కరణాల ద్వారా ఇచ్చిన భూములు కేసీఆర్ ప్రభుత్వంలో అవకతవకలు జరుగుతున్నాయని కిసాన్

  • Written By:
  • Publish Date - August 11, 2023 / 08:00 PM IST

ఇందిరా గాంధీ భూ సంస్కరణాల ద్వారా ఇచ్చిన భూములు కేసీఆర్ ప్రభుత్వంలో అవకతవకలు జరుగుతున్నాయని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి, మెదక్, నల్గొండ లో ఆ భూములను చట్ట విరుద్ధంగా బిల్డర్స్ కి అప్పగిస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. బుద్వెల్ లో 282 ఎకరాలు దళితులకు భూ సంస్కరణల చట్టం కింద పంచారని.. 1995 లో టీడీపీ హయాంలో అసైన్ భూమని ఆర్డివో నోటీసులు ఇచ్చారని కోదండ‌రెడ్డి తెలిపారు. హైకోర్టు దళితులకు ఇచ్చిన భూములు లాక్కోవడానికి లేదని 2008 కోర్టు తీర్పు ఇచ్చిందని ఆయ‌న గుర్తు చేశారు. హెచ్ఎండీఏ వంద ఎకరాల వరకు ఈ-వేలం వేసిందని.. 24 లక్షల ఎకరాల అసైన్ భూములు ఉంటే 10 వేల ఎకరాల అసైన్ భూములను బిల్డర్స్ కి అప్పగించారని కోదండ‌రెడ్డి తెలిపారు. భూములు రికార్డుల పక్షాన పేరుతో అక్రమాలు జరిగాయని ఆయ‌న ఆరోపించారు.

భూములు అమ్మకంలో మొదటి నేరస్థుడు మున్సిపల్ మంత్రి కేటీఆర్ అని.. ధరణి లోపాల విషయంలో ప్రభుత్వంని వ‌దిలిపెట్టేది లేద‌ని తెలిపారు. ఒక్కో గ్రామం లో దళితుల దగ్గర 9 లక్షలకు కొని 99 లక్షలకు అమ్ముకున్నారని కోదండ‌రెడ్డి ఆరోపించారు. ఇందిరా గాంధీ పంచిన భూములు పేదలకు అందేలా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని.. ఈ భూముల అమ్మకం చెల్లదన్నారు. యూపీఏ ప్రభుత్వం టైటిల్ గ్యారంటీ చట్టం తేవడానికి సర్వేలు చేయడానికి డబ్బులు కూడా కేటాయించిందని.. తాను హుడా చైర్మన్ గా ఉన్నప్పుడు 5 అంతస్థుల పైన కట్టద్దు అని నిర్ణయం తీసుకున్నామ‌ని తెలిపారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతున్న కేసీఆర్ అసైన్డ్‌ భూములు అమ్మాల్సిన అవసరం ఏముందని ప్ర‌శ్నించారు కిసాస్ సెల్ నాయ‌కులు చామల కిరణ్ రెడ్డి. కోకాపేట, బుద్వేల్, మోతెల భూములు కొన్నవారు గతంలో లబ్దిపోందిన వారేన‌ని..వీరంతా కేటీఆర్, హరీష్ రావు బందువులేన‌ని ఆయ‌న ఆరోపించారు.