Telangana Congress: కాంగ్రెస్ ఖమ్మం సభపై కేసీఆర్ కుట్ర?

తెలంగాణాలో జూలై 2వ తేదీ చరిత్రలో నిలిచిపోనుందా అంటే అవుననే అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు. తెలంగాణ ఇచ్చి రెండుళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్

Published By: HashtagU Telugu Desk
Telangana Congress

New Web Story Copy 2023 06 30t145449.781

Telangana Congress: తెలంగాణాలో జూలై 2వ తేదీ చరిత్రలో నిలిచిపోనుందా అంటే అవుననే అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు. తెలంగాణ ఇచ్చి రెండుళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఈ సారి అధికారమే లక్ష్యంగా ముందుకుసాగుతుంది. అందులో భాగంగా జూలై 2న ఖమ్మంలో కాంగ్రెస్ భారీ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో ఎక్కడలేని ఉత్సాహం నెలకొంది. మరోవైపు అదేరోజు మల్లు భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగియనుంది. ఓ వైపు బట్టి పాదయాత్ర, మరోవైపు రాహుల్ రాకతో ఖమ్మంలో కాంగ్రెస్ రూపురేఖలు మారనున్నాయి. మరీముఖ్యంగా ఆ రోజు ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు జరగనున్నట్టు ఆ పార్టీ ప్రచారం చేస్తుంది. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. రాహుల్ సమక్షంలో జూలై 2న ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

ఖమ్మం భారీ బహిరంగ సభపై బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. నిఘా సంస్థలు అధికార పార్టీకి చెప్పిన లెక్కలను బట్టి చూస్తే బీఆర్ఎస్ షాక్ కు గురైందట. ఊహించని వ్యక్తులు కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు నిఘా సంస్థలు చెబుతున్నాయి. దీంతో కెసిఆర్ టీమ్ ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో ఖమ్మం సభను ప్లాప్ షోగా ముద్రవేయాలని బీఆర్ఎస్ భావిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. లక్షలాది మంది వచ్చే ఆ సభను కట్టడి చేయాలంటే రవాణా వ్యవస్థకు బ్రేకులు వేయాలని అధికార పార్టీ భావిస్తుందని తెలుస్తుందని. ఈ మేరకు ఖమ్మం కాంగ్రెస్ సభకు వెళ్ళే ఆర్టీసీ బస్సులను యూటర్న్ తీసుకొనేలా కుట్ర చేస్తున్నట్టు కాంగ్రెస్ ఆరోపిస్తుంది.

కాంగ్రెస్ తలపెట్టిన ఖమ్మం సభపై కెసిఆర్ కుట్ర చేస్తున్నట్టు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అటువైపు వెళ్లే వాహనాలను ఎక్కడికక్కడ ఆపేందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, పోలీసులను రంగంలోకి దించినట్టు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సభ విజయవంతం అయితే ఎక్కడ తన అధికారం పోతుందోనని కెసిఆర్ లో భయం మొదలైందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. అయితే కెసిఆర్ ఎన్ని కుట్రలు చేసినా ఖమ్మం సభతో బుద్ది చెప్తామని చెప్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.

Read More: Onion Prices: టమాటా బాటలోనే ఉల్లి.. ఉల్లి ధరలు కూడా పెరగబోతున్నాయా..?

  Last Updated: 30 Jun 2023, 02:57 PM IST