Site icon HashtagU Telugu

Harish Rao: కర్ణాటక అక్రమ సొమ్మును కాంగ్రెస్ తెలంగాణ తరలిస్తోంది: మంత్రి హరీశ్ రావు

Harishrao

Harishrao

Harish Rao: బెంగళూరు నగరంలో జరిగిన ఐటి దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్మును తెలంగాణకు బదిలీ చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని హరీశ్ రావు ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బు పంచి గెలిచే ప్రయత్నం చేశారని అన్నారు. కర్ణాటకలో గతంలో 40 శాతం కమిషన్ ప్రభుత్వం ఉంటే.. ఇప్పుడు 50 శాతం కమిషన్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న అంబికాపతి ఆ రోజుల్లో 40 శాతం కమిషన్‌కి పని చేసేవారని, నేడు అదే అంబికా పతి 50% కమిషన్ వసూలు చేసి తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తున్నారని మంత్రి అన్నారు.

అంబికాపతి సతీమణి అశ్వత్తమ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటరని, ఇద్దరూ ఇంట్లో వుండగానే ఐటి దాడులు జరిగాయని, ఐటీ దాడుల్లో రూ. 42 కోట్ల నగదు లభ్యమయ్యాయని అన్నారు. తెలంగాణకు తరలించేందుకు కాంట్రాక్టర్ ల నుంచి వసూలు చేసిన డబ్బు ఇది అని తెలుస్తోందని మంత్రి అన్నారు. కాంగ్రెస్ దీనిపై సమాధానం చెప్పాలని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘దాదాపు 1500 కోట్ల రూపాయలను తరలించే ప్లాన్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. 42 కోట్ల రూపాయలను తరలిస్తూ బెంగళూరులో ఐటీ అధికారులకు అడ్డంగా దొరికిన కాంగ్రెస్ గతంలో కర్ణాటకలో 40% కమీషన్ బీజేపీ ప్రభుత్వం ఉంటే ఇప్పుడు 50% కమీషన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ అవినీతి కాంగ్రెస్ తో… తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలారా!’’ అంటూ హరీశ్ రావు మండిపడ్డారు.

Exit mobile version