Site icon HashtagU Telugu

Cong On KTR: కేటీఆర్ పై మాణిక్కం ఠాగూర్ సెటైర్ మామూలుగా లేదుగా..!!

KTR Manickam

KTR Manickam

ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా కొద్దీ…తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఇన్నాళ్లూ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సాగిన…రాజకీయం..ఇప్పుడు టీఆరెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పర్యటనతో తెలంగాణలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. రాహుల్ పర్యటన ముగిసినా…ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి కేటీఆర్….ట్విట్టర్ వేదికగా…ASK KTRఅనే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ సెటైర్లు విసిరారు.

రాజకీయ అంశాలతోపాటుగా నగరంలో ఉన్న పలు సమస్యలతోపాటు ఎన్నికల్లో మిస్సింగ్ ఓట్లు సహా అనేక అంశాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలతోపాటు…చాలా పార్టీలు మాకు పోటీలో ఉన్నాయని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీకి వ్యంగ్యంగా చురకలంటించారు. మొదట అమేథీలో గెలవడంపై దృష్టి పెట్టాలన్నారు. అయితే ఈ సమయంలోనే మాణిక్కం ఠాగుర్ పలు ప్రశ్నలను సంధించారు. ఆస్తులు పెంచుకోవడానికి రహస్యమేంటో…కేటీఆర్ రాష్ట్ర యువతకు వివరించాలని సెటైర్ వేశారు.

కేటీఆర్ ఆస్తులకు సంబంధించి…2014 అసెంబ్లీఎన్నికల సమయంలో రూ.7కోట్ల ఆస్తున్నాయని అఫిడవిట్ లో చూపించిన కేటీఆర్…2018 వచ్చే వరకు ఆయన ఆస్తులు రూ.41కోట్లు పెరిగాయని ఠాగూర్ తెలిపారు. 2018 నుంచి 2023 వరకు ఎంత టార్గెట్ అంటూ కేటీఆర్ ప్రశ్నించారాయన. దీంతో ASK KTRఎపిసోడ్ లో కూడా సామాన్యుల కంటే రాజకీయ నేతల విమర్శలకే ప్రాధాన్యం దక్కిందంటూ పలువురు అంటున్నారు.