Congress: తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్

Congress: అసెంబ్లీ ఎన్నికల ఊపును పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగించాలని ఫిక్స్ అయ్యింది కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తుక్కుగూడ భారీ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కానుండటంతో పాటు.. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ఏఐసీసీ హైదరాబాద్‌లోని రిలీజ్ చేస్తుండటంతో టీ-కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లకు గాను 14 ఎంపీ సీట్లను […]

Published By: HashtagU Telugu Desk
Congress Election Committee

Congress released another list

Congress: అసెంబ్లీ ఎన్నికల ఊపును పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగించాలని ఫిక్స్ అయ్యింది కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తుక్కుగూడ భారీ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కానుండటంతో పాటు.. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ఏఐసీసీ హైదరాబాద్‌లోని రిలీజ్ చేస్తుండటంతో టీ-కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది.

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లకు గాను 14 ఎంపీ సీట్లను గెలిచి తీరాలని కాంగ్రెస్‌ పార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఎన్నికలయ్యేంత వరకు ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా బాధ్యతలను పంచుకోవాలనీ, కార్యకర్తల వెన్నంటి ఉండాలని ఆ పార్టీ తెలంగాణ నేతలు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయిన సీఎం రేవంత్ రెడ్డి గతంలో తమకు విజయం తెచ్చిపెట్టిన మల్కాజిగిరి ఎన్నికల మోడల్‌ను రాష్ట్రమంతటా అనుసరించా లని ఇప్పటికే పార్టీ ముఖ్యులకు రేవంత్‌రెడ్డి కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఎన్నిల్లో గెలిచేందుకు కాంగ్రెస్ ప్రత్యేకంగా కమిటీ వేస్తోంది. పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి కమిటీలో ఏఐసీసీ పరిశీలకులతో పాటు అక్కడి పార్టీ ముఖ్యులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు భారీగా జనసమీకరణ చేయనున్నారు.

  Last Updated: 23 Mar 2024, 09:50 PM IST