Lok Sabha Elections : ఎంపీ అభ్యర్థుల ఉత్కంఠ కు తెరదించిన కాంగ్రెస్

బుధువారం పెండింగ్ లో ఉన్న మూడు స్థానాలకు సంబదించిన అభ్యర్థులను ప్రకటించి ఉత్కంఠకు తెరదించారు

Published By: HashtagU Telugu Desk
Congress Boycott Exit Poll

Telangana Congress MPs dharna in Delhi

కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఉత్కంఠ కు తెరదించింది కాంగ్రెస్ అధిష్టానం. లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) సమయం దగ్గరకు వస్తున్నప్పటికీ ఖమ్మం , హైదరాబాద్ , కరీంనగర్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించకపోయేసరికి నేతల్లో , కార్యకర్తల్లో రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతూ వస్తుంది. ఎప్పుడు ఆ అభ్యర్థులను ప్రకటిస్తారు..? వారు ఎప్పుడు ప్రచారం మొదలుపెడతారు..? అసలు ఎవర్ని ఫైనల్ చేస్తారనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ అభ్యర్థి విషయంలో అధిష్టానం.. గత కొద్దీ రోజులుగా ఎటు తేల్చుకోలేక పోతు వస్తుంది. ఎందుకంటే ఖమ్మం స్థానం కోసం ఎంతోమంది కర్చీఫ్ వేసుకొని కూర్చున్నారు. రెండు రోజులు ఓ అభ్యర్థి పేరు గట్టిగా వినిపిస్తే..మరో రెండు రోజులు మరో అభ్యర్థి పేరు వినిపిస్తూ వచ్చింది. ఇలా రోజుకో పేరు వినిపిస్తుండడం తో ఎవర్ని ఫైనల్ చేస్తారా అని అంత అనుకుంటూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో ఈరోజు బుధువారం పెండింగ్ లో ఉన్న మూడు స్థానాలకు సంబదించిన అభ్యర్థులను ప్రకటించి ఉత్కంఠకు తెరదించారు. వీరిలో ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి, కరీంనగర్‌ అభ్యర్థిగా రాజేందర్‌ రావు, హైదరాబాద్‌ అభ్యర్థిగా మహమ్మద్‌ సమీర్‌లను ప్రకటించింది. ఈమేరకు ఏఐసీసీ తుదిజాబితాను ప్రకటించింది. అలాగే త్వరలో జరగబోయే ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్నను ప్రకటించింది. దీంతో వీరంతా రేపటి నుండి తమ ప్రచారంతో హోరెత్తించబోతున్నారు.

Read Also : Madhavi Latha : మాధవిలత చరిత్రను తిరగరాస్తుందా..?

  Last Updated: 24 Apr 2024, 09:37 PM IST