Site icon HashtagU Telugu

Telangana: కాంగ్రెస్ హామీలు సంతకం లేని చెక్ లాంటివి: హరీష్

Telangana

Telangana

Telangana: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో జోరు మొదలైంది. తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. దీంతో ఇరు పార్టీల నేతలు రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలకు దిగుతున్నారు. రెండ్రోజుల క్రితం ఢిల్లీ కాంగ్రెస్ తెలంగాణ గడ్డపై మేనిఫెస్టోని రిలీజ్ చేసి వెళ్ళింది. ఆరు స్పష్టమైన హామీలను ప్రకటించిన తర్వాత అధికార పార్టీ బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణకు ఆరు హామీలను ప్రకటించిన కాంగ్రెస్‌పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కేవలం అధికారం కోసమే ప్రజలను నమ్మించి కాలక్షేపం చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. మెదక్ జిల్లాలో 100 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన అనంతరం 350 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా తడ్కల్‌లో మైనార్టీ ఫంక్షన్‌ హాల్‌ ప్రారంభోత్సవంతోపాటు అభివృద్ధి కార్యక్రమాల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు.

హరీష్ మాట్లాడుతూ.. పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేసి వారు ఆత్మగౌరవంతో బతకాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేశారని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో ప్రతి 6 నెలలకు ఒకసారి కర్ఫ్యూ వస్తుంది అని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ బూటకపు మాటలకు తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కోరిన హరీశ్ రావు.. కేసీఆర్ ను తిట్టడం తప్ప వేరే గత్యంతరం లేదన్నారు. మరోవైపు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్. బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చాం అని మంత్రి చెప్పారు. 100 కొత్త గ్రామ పంచాయతీలను చేసాము. మొత్తం 223 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయన్నారు.

Also Read: Chiranjeevi Blood Bank : తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచిత రక్తం.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి.. పేద పేషంట్స్ కోసం..