Site icon HashtagU Telugu

Harish Rao: ప్రభుత్వ హాస్టళ్ల ఫుడ్ పాయిజన్ ఘటనలపై హరీశ్ రావు రియాక్షన్.. కాంగ్రెస్‌పై ఫైర్

Harish Rao

Harish Rao

Harish Rao: తెలంగాణ ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ సంఘటనలపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. మొన్న భువనగిరి గురుకుల హాస్టల్లో కలుషిత ఆహారం తిని చనిపోయిన ప్రశాంత్ ఉదంతాన్ని మరవక ముందే మరో ఫుడ్ పాయిజన్ ఉదంతం వెలుగులోకి వచ్చిందని హరీశ్ రావు అన్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీవీబీ పాఠశాలలో శుక్రవారం 11 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

బిఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ గురుకులాల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరికి ఈ ఉదంతాలు అద్దం పడుతున్నాయని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బాధిత విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు.

యాదాద్రి భువనగిరి జిల్లా సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 6వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల దళిత విద్యార్థి మృతి చెందగా, 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బంజారాహిల్స్ రెయిన్ బో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రశాంత్ మృతి చెందగా, మరో 16 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

Exit mobile version