కేసీఆర్ భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

తెలంగాణ మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) భద్రత కుదించింది. ఆయనకు వై కేటగిరి భద్రత (‘Y’ Category Protection) కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 4+4 గన్‌మెన్లతో పాటు ఎస్కార్ట్ వాహనం కూడా కేసీఆర్‌ వెంట ఉండనుంది. అలాగే కేసీఆర్ ఇంటి ముందు సెంట్రీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మాజీ మంత్రులకు 2+2 భద్రతను పోలీస్‌ శాఖ కేటాయించింది. మాజీ ఎమ్మెల్యేలకు పూర్తిగా భద్రత […]

Published By: HashtagU Telugu Desk
KCR Injured

Will Kcr's Unexpected Strategies Work

తెలంగాణ మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) భద్రత కుదించింది. ఆయనకు వై కేటగిరి భద్రత (‘Y’ Category Protection) కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 4+4 గన్‌మెన్లతో పాటు ఎస్కార్ట్ వాహనం కూడా కేసీఆర్‌ వెంట ఉండనుంది. అలాగే కేసీఆర్ ఇంటి ముందు సెంట్రీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మాజీ మంత్రులకు 2+2 భద్రతను పోలీస్‌ శాఖ కేటాయించింది. మాజీ ఎమ్మెల్యేలకు పూర్తిగా భద్రత తొలగించింది. వారికి కేటాయించిన గన్‌మెన్లను పోలీసు ఉన్నతాధికారులు వెనక్కి పిలిపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరెవరికి భద్రత అవసరమనే అంశంపై.. ఉన్నతాధికారులతో సమీక్షించి అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు యధావిధిగా భద్రత కొనసాగనుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె కొద్దీ సేపటి క్రితం కేసీఆర్ యశోద హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల క్రితం తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడడంతో ఆయన తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. దీంతో సోమాజిగూడ యశోద హాస్పటల్ (Yashoda Hospital) లో ఆయనకు సర్జర్ చేసారు. గత వారం రోజులుగా హాస్పటల్ లో చికిత్స తీసుకుంటూ వచ్చిన కేసీఆర్ ఈరోజు హాస్పటల్ నుండి డిశ్చార్జ్ (KCR will be discharged ) అయ్యారు. హాస్పటల్ నుండి నంది నగర్ ఇంటికి కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ స్పష్టం చేశారు.

కేసీఆర్ ప్రమాదానికి గురయ్యారని తెలిసి ప్రధాని మోడీ, బిఆర్ఎస్ నేతలు , శ్రేణులతో పాటు ఇతర పార్టీల నేతలు , సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. అలాగే హాస్పటల్ కు వచ్చి కేసీఆర్ ను పలకరించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , మాజీ సీఎం చంద్రబాబు , కాంగ్రెస్ మంత్రులు , బిఆర్ఎస్ నేతలు అలాగే చిత్రసీమ నుండి మెగా స్టార్ చిరంజీవి , నాగార్జున , ప్రకాష్ రాజ్ తదితరులు హాస్పటల్ కు వచ్చి కేసీఆర్ ను చూడడం జరిగింది.

Read Also : TSRTC: నేటి నుంచి మహిళలకు జీరో టికెట్లు జారీ

  Last Updated: 15 Dec 2023, 11:25 AM IST