Electrical System: సిద్దిపేట ఎమ్మెల్యే హారీశ్ రావు(Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పై మరోసారి విమర్శలు గుప్పించారు. ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిందని ఆయన అన్నారు. కరెంట్ కోతల విషయంలో వైఫల్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అంగీకరించలేదన్నారు. ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తాను ఖండిస్తున్నానన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు విద్యుత్‌ను సరఫరా చేసిందన్నారు. ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన విద్యుత్ వ్యవస్థను నిర్మించామన్నారు. కరెంట్ కోతలు సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేదన్నారు.
Read Also: Pak vs Ire: చెలరేగిన బాబర్ – రిజ్వాన్.. టీమిండియాకు హెచ్చరికలు
మరోవైపు విద్యుత్ శాఖలో కొందరు కావాలనే పవర్ కట్ చేస్తున్నారని… అందుకే కొన్నిచోట్ల విద్యుత్ కోతలొస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు కొందరితో ఇలాంటి తలతిక్క పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆయన హైదరాబాద్‌లో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ… తెలంగాణలో బీజేపీ వేవ్ ఏమీ లేదని… తాము 9 నుంచి 13 లోక్ సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆరేడు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కవన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని… ఆత్మహత్యలే ఉంటాయని… అందుకు బీఆర్ఎస్ నిదర్శనమన్నారు. తమకు బీజేపీతో మాత్రమే పోటీ అన్నారు. జాతీయస్థాయిలో బీజేపీకి పూర్తి మెజార్టీ రాదని జోస్యం చెప్పారు.