Site icon HashtagU Telugu

MLC Kavitha : కాంగ్రెస్ సర్కారుకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు: ఎమ్మెల్సీ కవిత

Congress government must be punished in public court: MLC Kavitha

Congress government must be punished in public court: MLC Kavitha

MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏసీబీ కేసులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ప్రజల తరపున మాట్లాడిన వారిపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమ కేసుల పెడతోందని, ఎలాంటి కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోమని ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పై రేవంత్ సర్కారు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నదని, అందుకే ఆయనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నదని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.12 వేలకు తగ్గించి రైతులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని కవిత విమర్శించారు. సీఎం రేవంత్ మోసపూరిత హామీలు ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. మోసపూరిత నిరంకుశ కాంగ్రెస్ సర్కారుకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. బీఆర్ఎస్ ధర్నాలకు భయపడిన ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తుందని కవిత ఆరోపించారు.

మరోవైపు కేటీఆర్ ఈ రోజు ఉదయం ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ ఆఫీసుకు వెళ్లారు. అయితే అక్కడ జరిగిన పరిణామాలు ఊహించని విధంగా మారాయి. కేటీఆర్ విచారణలో పాల్గొనకుండా, ఏసీబీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామం జరిగిన సమయంలో, 40 నిమిషాల పాటు పోలీసులకు, కేటీఆర్ బృందం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విచారణ సమయంలో, కేటీఆర్ తన లాయర్‌ను లోపల అనుమతించాలని కోరినా, పోలీసులు కోర్టు ఉత్తర్వుల ప్రకారం లాయర్‌ను అనుమతించడానికి తడబాటు చూపించారు. ఈ నిర్ణయంతో కేటీఆర్ అంగీకరించకపోవడంతో, ఆయన లాయర్‌ను అనుమతించాలని పోలీసులు తెలియజేస్తే, కేటీఆర్ దీనిని నిరసిస్తూ, అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Read Also:  Hair Serum : మీ జుట్టుకు సీరమ్ అప్లై చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి..!