తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government )..కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ముఖ్యంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా వాణి (Prajavani) కార్యక్రమానికి రోజు రోజుకు విశేష స్పందన వస్తుండడం తో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులకు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ఆన్ లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పోర్టల్‌లో ప్రజావాణిలో ఫిర్యాదు సందర్భంగా ప్రభుత్వం నుంచి రిఫరెన్స్ నెంబర్ ప్రకారం తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రజావాణిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్‌కు మంత్రులు హాజరుకావాలని ఆదేశించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు మంగళవారం కూడా ప్రజా వాణికి విశేష స్పందన వచ్చింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలు తెలిపేందుకు ప్రజా భవన్ కు వచ్చారు. ఇక ప్రజావాణికి వస్తున్న స్పందన పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. గతంలో బంగారు పాలన అందించామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.. బంగారు పాలన అందిస్తే ప్రజావాణి కోసం ప్రజలు ఎందుకు బారులు తీరుతారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకే బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ది చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని అందులో సందేహించాల్సిన అవసరమేమి లేదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుని.. అర్జీలను స్వీకరించారు. ప్రతి అర్జికి ఒక నంబర్‌ను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
Read Also : Talasani Srinivas Yadav: ఫైళ్లు చోరీ కేసులో విచారణకు హాజరైన తలసాని