తెలంగాణలో రైతుల పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారుతుందంటూ, అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతుకు కనీసం ఒక బస్తా యూరియా ఎరువు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందంటూ మండిపడ్డారు. రైతు భరోసా, రుణమాఫీ వంటి వాగ్దానాలు అన్నీ వాయిదా వేయబడ్డాయని ఆరోపించారు. “అప్పు తెచ్చి సాగు చేద్దామంటే ఎరువులే లేకపోవడం” దారుణమని అన్నారు.
TG New Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనా..?
ప్రస్తుతం రాష్ట్రంలో 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఉందని, ఇది రైతులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోందని కేటీఆర్ వెల్లడించారు. అంతే కాకుండా గతంలో రూ. 266.50గా ఉన్న యూరియా బస్తా ధరను ఇప్పుడు రూ. 325కు పెంచారని ఆరోపించారు. ఈ ధర పెరుగుదల వల్ల రైతుపై ఆర్థిక భారం పడుతుందని అన్నారు. రైతన్నలు ఎరువుల కోసం లైన్లలో నిలబడే దుస్థితిని చూసి బాధ కలుగుతోందని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల బ్లాక్ మార్కెట్ బహిరంగంగా నడుస్తోంది, కానీ ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఈ బ్లాక్ మార్కెట్‌కు బాధ్యులు? ఎవరూ విచారణ చేయకపోవడం దారుణమని అన్నారు. తక్షణమే యూరియా కొరతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను నిర్లక్ష్యం చేసిన పాలన ఎంతకాలం నిలుస్తుందో ప్రజలే నిర్ణయిస్తారన్నారు.