Site icon HashtagU Telugu

BRS Party: రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి సింగిరెడ్డి

Niranjan Reddy

Niranjan Reddy

BRS Party: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. గత ఏడాది అకాల వర్షాల నేపథ్యంలో పంటలు దెబ్బతింటే వికారాబాద్ , వరంగల్ జిల్లాలో పంటలు దెబ్బతింటే స్వయంగా నేను, కేసీఆర్ గారు పర్యటించి ధైర్యం కల్పించారని, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్రకారం రూ.2000 – 2500 అంచనా వేసిన కూడా రైతుకన్నా మించిన వాడు లేడని ఎకరాకు రూ.10 వేల పంట సాయం అందించామని ఆయన అన్నారు.

తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం వహిస్తుందని, నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం .. వెంటనే జీఓను విడుదల చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.  అదిలాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలలో వేలాది ఎకరాల్లో పంటలు అకాల వర్షాలకు దెబ్బతిన్నాయని, 3.5 ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు .. 80 శాతం అంటూ అబద్దాలు .. అడిగితే చెప్పుతో కొడతాం అంటున్నారని ఆయన మండిపడ్డారు.

జలాశయాల్లో ఉన్న నీళ్లను అంచనా వేసి రైతుల పంటల సాగుకు సూచన చేయమంటే ఒక్కనాడు ప్రభుత్వం సమీక్ష చేయలేదని, కాంగ్రెస్ చర్యలను రైతులు గమనించాలి .. కాంగ్రెస్ పార్టీని నమ్మితే వచ్చిన మార్పును గమనించాలని మాజీ మంత్రి అన్నారు.  అప్పులు చేశారు మరి రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వ లేదు ? గుత్తేదారులకు మాత్రం బిల్లులు ఇస్తారా ? చేసిన అప్పులతో ఏం చేస్తున్నారని సింగిరెడ్డి ప్రశ్నించారు.