Site icon HashtagU Telugu

KTR Hot Comments: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ద్రోహం చేసింది.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

KTR Hot Comments

KTR Hot Comments

KTR Hot Comments: హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR Hot Comments) మీడియా సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పోచంపల్లి, రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కేటీఆర్ మాట్లాడుతూ.. కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాది పూర్తయింది. బలహీన వర్గాలకు, ఆడబిడ్డలకు డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్. కొత్త హామీలు దేవుడెరుగు, ఉన్నవాటిని రద్దు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ద్రోహం చేసింది. వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచింది. చేతి గుర్తుకు ఓటేస్తే, చేతివృత్తులవారి గొంతు కోసింది. ఇప్పుడు బీసీల ఓట్ల కోసం కులగణన పేరుతో నాటకం ఆడుతోందని మండిప‌డ్డారు.

Also Read: Yogi Vs Ajit Pawar :‘బటేంగే తో కటేంగే’ నినాదంపై సీఎం యోగి వర్సెస్ అజిత్ పవార్

అలాగే సర్వే పేరుతో వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారు. ప్రజలు ఎక్కడికక్కడ గ్యారెంటీలు ఏవని నిలదీస్తున్నారు. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని పొంగులేటి అంటున్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి. రూ. 3 లక్షల బీసీల ఫీజు రీయంబర్స్‌మెంట్‌, బీసీ గురుకులాలు, బీసీ డిగ్రీ కళాశాలలు ఎటు పోయాయి. చేసిన మోసానికి బీసీలకు క్షమాపణలు చెప్పు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ చిత్తశుద్ధిపై మాకు అనుమానాలు ఉన్నాయి. 60 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి బీసీలకు ఒరగబెట్టింది ఏమి లేదని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసం కులగణన డ్రామా నడుస్తోంది. కులగణనను స్వాగతిస్తున్నం, రాజకీయ ఆర్థిక నేపథ్యం పై ప్రశ్నలు ఎందుకు.బీసీ డిక్లరేషన్ పై బీసీలను చైతన్యం చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ డిక్లరేషన్ లపై మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మా ఎమ్మెల్యేలపై దాడి చేయడం కాదు. దమ్ముంటే ఇచ్చిన హామీలు నెరవేర్చు. సిగ్గు ఎగ్గు, నీతి, లేకుండా దగుల్బాజీ మాటలు మాట్లాడాడు రేవంత్ రెడ్డి. మహారాష్ట్రకు వెళ్లి చేయని పనులు, చేసినట్లు చెప్పారు. రైతులకు 500 బోనస్ ఇచ్చినట్లు మహారాష్ట్రలో చెప్పారు. అది నిరూపిస్తే మేము రాజీనామా చేస్తాం. 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేసేదాకా వెంటపడతాం. కాంగ్రెస్ అతి వేషాలు వేస్తే, ప్రజలే బట్టలు విప్పి వురికించి కొడతారని కామెంట్స్ చేశారు.

Exit mobile version