Vemulawada Temple: వేములవాడ దేవస్థానంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్.. కొత్త మాస్టర్ ప్లాన్‌తో అభివృద్ధిపై‌ దృష్టి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడపై రాష్ట్ర ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వం పైనా తీవ్రమైన విమర్శలు చేస్తూ అభివృద్ధిలో తమ చిత్తశుద్ధి అంటే ఏమిటో చూపిస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

Published By: HashtagU Telugu Desk
Vemulawada Temple

Vemulawada Temple

Vemulawada Temple: దక్షిణ‌కాశిగా‌ పిలువబడే వేములవాడ దేవస్థానం (Vemulawada Temple) అభివృద్ధిపై కాంగ్రెస్ ‌ప్రభుత్వం‌ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర బడ్జెట్ లోనే 116 కోట్ల రూపాయల నిధులను వేములవాడ దేవస్థానంకు కెటాయించింది. ఈ క్రమంలోనే తక్షణమే రూ. 53 కోట్ల నిధులు విడుదల చేస్తూ కొత్త‌ మాస్టర్ ప్లాన్‌కు రూపకల్పన చేసింది. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు‌ ఈనెల 20 తేదీన వేములవాడకు సీఎం రేవంత్ రానున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడపై రాష్ట్ర ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వం పైనా తీవ్రమైన విమర్శలు చేస్తూ అభివృద్ధిలో తమ చిత్తశుద్ధి అంటే ఏమిటో చూపిస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రతి యేటా వేములవాడ దేవస్థానం అభివృద్ధికి వంద కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామని ప్రకటించింది. కానీ 63 కోట్ల రూపాయ‌ల‌ నిధులు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకుంది. ఈ క్రమంలోనే వేములవాడ దేవస్థానం కొత్త మాస్టర్ ప్లాన్‌ను కాంగ్రెస్ రూపొందించింది. ముందుగా రోడ్ల వెడల్పు, కళ్యాణకట్ట, కోనేరు సందరీకరణ, గుడిచెరువు అభివృద్ధి భక్తుల సౌకర్యార్థం వసతి గృహాల నిర్మాణంపైనే దృష్టి పెట్టి అందుకు తగ్గట్టుగానే నిధులు విడుదల చేసింది.

Also Read: Narendra Modi : వారి శక్తి ఖండాలు దాటి మనల్ని బంధించే ఆప్యాయతను ప్రతిబింబిస్తుంది

ఇప్పటికే ప్రభుత్వం వేములవాడ అలయ అభివృద్ధిపైనా సమీక్ష ‌సమావేశం నిర్వహించింది. భక్తుల సంఖ్యకు అనుకూలంగా సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ఫ్లాన్ చేసింది. గత కొన్నేండ్లుగా వేములవాడ ఆలయ అభివృద్ధి పైనా వివక్ష కొనసాగుతుందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మొదటి రాష్ట్ర ‌బడ్జెట్ లోనే వేములవాడ అలయ అభివృద్ధికి నిధులు కేటాయించి ప్రతిపక్షాలకు ‌కౌంటర్ ఇచ్చింది. సాధ్యమైనంత ‌వేగవంతంగా అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తులకు అసౌక‌ర్యాలు కలగకుండా చూడాలన్నది ప్రభుత్వం ముఖ్య‌ ఉద్దేశ్యం.

వేములవాడ అలయ‌ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసేందుకు ఈనెల 20న వేములవాడ రానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో అప్పటి సీఎం కేటీఆర్ ఆలయానికి వచ్చి ప్రతి యేటా వంద కోట్లు ఇస్తామని ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేయకుండానే నిధులను విడుదల చేసింది.

  Last Updated: 18 Nov 2024, 10:59 AM IST