Site icon HashtagU Telugu

Congress Politics: కోమటిరెడ్డి తో రేవంత్ కు చెక్

komati reddy revanth

komati reddy revanth

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరుకున్న పదవిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాధించారు. ఇది తాజాగా కాంగ్రెస్ పార్టీలో జరిగిన కీలక పరిణామంగా తీసికోవచ్చు. తెలంగాణ స్టార్ క్యాంపెనర్ గా కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు. కోమటి రెడ్డి కి అభినందనలు చెప్పారు. ఈ నిర్ణయం సీనియర్లకు జ్యోష్ నింపింది. అధిష్టానం రేవంత్రెడ్డికి కత్తెర వేస్తుందని అర్థం అవుతుంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మరింతగా దూకుడు పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో త్వరలోనే రాహుల్ గాంధీ బహిరంగ సభ జరుగే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కోరగా…రాహుల్ గాంధీ అందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. వరంగల్ వేదికగా ఈ సభ జరిగే అవకాశం ఉందని సమాచారం.
తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా దృష్టి సారిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో నెలకొన్న కాంగ్రెస్ పరిస్థితులను చక్కదిద్దేందుకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నించాలని నాయకులకు దిశానిర్థేశం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ పై విమర్శలు చేస్తున్న జగ్గారెడ్డి కూడా ఇటీవల రాహుల్ గాంధీని కలిశారు.

తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా ప్రయత్నిస్తామని అన్నారు జగ్గారెడ్డి.ఇంకో వైపు వీహెచ్ సోనియాను కలిశారు. ఫలితంగా రేవంత్ కు చెక్ పెట్టేలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి కీలక పదవిని ఏఐసీసీ ఇచ్చింది. ఇక రేవంత్ సీఎం అసలు గల్లంతు అయినట్టే అని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలుపెట్టారు. మొత్తం మీద రేవంత్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ఈ పరిణామం సంకేతాలు ఇస్తుంది.